ETV Bharat / sports

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు సింధు, శ్రీకాంత్ - వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు సింధు, శ్రీకాంత్

భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్​ టూర్​ ఫైనల్స్​కు అర్హత సాధించారు. బ్యాంకాక్‌ వేదికగా ఈ నెల 27 నుంచి 31 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. వీరికి సోమవారం మళ్లీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో నెగెటివ్​గా తేలితేనే టోర్నీలో ఆడే అవకాశం కల్పిస్తారు.

sindhu
సింధు
author img

By

Published : Jan 25, 2021, 8:26 AM IST

ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్​కు భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ అర్హత సాధించారు. బ్యాంకాక్‌ వేదికగా ఈనెల 27 నుంచి 31 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది.

కరోనా కారణంగా దాదాపు పది నెలల పాటు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితం థాయ్‌లాండ్‌ ఓపెన్ రెండు సూపర్‌ 1000 టోర్నీలతో అంతర్జాతీయ సీజన్‌ పునః ప్రారంభమైంది. ఈ రెండు టోర్నీల్లో భాగంగా రెండోది ఆదివారం ముగిసింది. అనంతరం వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారుల వివరాలను ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ప్రకటించింది. భారత్‌ తరఫున పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ అర్హత పొందారు.

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ రెండు టోర్నీల్లో బరిలోకి దిగిన ఆటగాళ్లనే వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు పరిగణిస్తామని బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది. ఈ టోర్నీలకు బయలుదేరేముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో జపాన్, చైనా ఆటగాళ్లకు పాజిటివ్‌ రావడం వల్ల ఈ రెండు దేశాల ఆటగాళ్లు థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగారు. దీంతో ఈ ఆటగాళ్లు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ఆడే అవకాశం కోల్పోయారు.

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో ఉన్నవారే ఈ టోర్నీలో ఆడతారు. అయితే ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో సింధు 11వ ర్యాంక్‌లో నిలిచింది. టాప్‌-8లో ముగ్గురు థాయ్‌లాండ్‌ క్రీడాకారిణిలు ఉండటం, జపాన్‌ ప్లేయర్‌ నొజోమి ఒకుహారా గైర్హాజరు కావడం వల్ల పీవీ సింధు ఎనిమిదో ర్యాంక్​కు ఎగబాకింది. ఫలితంగా వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ బెర్త్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ ఏడో ర్యాంకర్‌గా అర్హత పొందాడు.

అయితే ఈ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత పొందిన ఆటగాళ్లందరికీ సోమవారం(నేడు) మళ్లీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో నెగెటివ్​గా తేలితేనే టోర్నీలో ఆడే అవకాశం కల్పిస్తారు.

ఇదీ చూడండి : ఐదు నెలల తర్వాత ప్రాక్టీస్.. రాకెట్ పట్టని సింధు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.