లాక్డౌన్ తర్వాత ప్రారంభమైన డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు చెందిన స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ విభాగంలోని రెండో రౌండ్లో కెనడియన్ ప్రత్యర్థిని 21-15, 21-14తో ఓడించాడు.
డెన్మార్క్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్న మరో భారతీయుడు లక్ష్యసేన్ రెండోరౌండ్లో హన్స్-క్రిస్టియన్ సోల్బెర్గ్ విట్టింగస్‌తో ఆడాల్సిఉంది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన బ్యాడ్మింటన్ టోర్నీలను బీడబ్ల్యూఎఫ్ రద్దు చేసింది. బీడబ్ల్యూఎఫ్ క్యాలెండర్లో ఈ ఏడాది జరుగుతున్న టోర్నీ డెన్మార్క్ ఓపెన్ ఒక్కటే. ఆసియా లీగ్, వరల్డ్ టూర్ ఫైనల్‌ను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేశారు.