బర్మింగ్‌హామ్ వేదికగా ఈరోజు ప్రారంభమైన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తొలిరోజే భారత్‌కు నిరాశ ఎదురైంది. అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ షట్లర్ పీవీ సింధు...తొలి రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన సుంగ్ చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్లో 16-21తో ఓటమి పాలైన సింధు, రెండో సెట్‌ను 22-20తో గెలుచుకుంది. చివరి సెట్లో 17-21 తేడాతో ఓడిపోయి ఛాంపియన్షిప్ నుంచి నిష్క్రమించింది.
Last year's SF at @YonexAllEngland , @Pvsindhu1 fought like a warrior saving 9️⃣ match points to keep herself in the hunt but Korea's #SungJiHyun secured the thriller of a contest at 21-16,20-22,21-18 in the end that lasted over an hour. Tough luck girl! #IndiaontheRise #YAE19 pic.twitter.com/fJL7LxchJl
— BAI Media (@BAI_Media) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Last year's SF at @YonexAllEngland , @Pvsindhu1 fought like a warrior saving 9️⃣ match points to keep herself in the hunt but Korea's #SungJiHyun secured the thriller of a contest at 21-16,20-22,21-18 in the end that lasted over an hour. Tough luck girl! #IndiaontheRise #YAE19 pic.twitter.com/fJL7LxchJl
— BAI Media (@BAI_Media) March 6, 2019Last year's SF at @YonexAllEngland , @Pvsindhu1 fought like a warrior saving 9️⃣ match points to keep herself in the hunt but Korea's #SungJiHyun secured the thriller of a contest at 21-16,20-22,21-18 in the end that lasted over an hour. Tough luck girl! #IndiaontheRise #YAE19 pic.twitter.com/fJL7LxchJl
— BAI Media (@BAI_Media) March 6, 2019
గత ఏడాది హాంకాంగ్ ఓపెన్‌లోనూ సుంగ్ చేతిలోనే ఓడింది సింధు. ఇది సింధుకు వరుసగా రెండో ఓటమి. మొత్తంగా 15 సార్లు ఈ షట్లర్లు ఢీకొనగా.. తెలుగు తేజం ఎనిమిదింట్లో పైచేయి సాధించగా.. ఏడింట్లో సుంగ్ గెలిచింది.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
" నాపై ఆధిపత్యం సాధించడంలో సుంగ్ సఫలమయింది. నేను కొట్టిన స్మాష్‌లు ఎక్కువగా నెట్‌ను తాకి కిందపడిపోయాయి. ఇది నా దురదృష్టం. ఆమె చాలా బాగా ఆడింది." --పీవీ సింధు
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకూ ఇద్దరు భారత షట్లర్లు మాత్రమే టైటిల్ గెలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొణె విజేతగా నిలవగా.. 2001లో పుల్లెల గోపీచంద్ టైటిల్ సాధించారు. ఈ టోర్నీలో ఏడుసార్లు పోటీపడిన సింధు.. కనీసం సెమీస్‌ను కూడా దాటలేకపోయింది.