జాతీయ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సౌరభ్ వర్మ.. హైదరాబాద్ ఓపెన్ ఫైనల్లో ప్రవేశించాడు. శనివారం ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మలేషియాకు చెందిన జుల్కరనైన్పై 23-21, 21-16 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఈ గేమ్ 48 నిమిషాల్లోనే ముగిసింది. ఆదివారం జరిగే తుదిపోరులో లోకియన్(సింగపూర్)-హీయో క్వాంగ్ హీ(కొరియా) మ్యాచ్ గెలిచిన వారితో తలపడనున్నాడు సౌరభ్.
ఇదే టోర్నీలో మహిళా విభాగంలో భారత్‌కు చెందిన టాప్ సీడ్ డబుల్స్ జోడి అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి.. హాంకాంగ్‌కు చెందిన ఫాన్ కా యాన్- వూయి టింగ్ జంటను 21-12, 21-12 పాయింట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం కొరియాకు చెందిన బేక్ హనా-జుంగ్ క్యూంగ్ ఎన్తో హోరాహోరీగా తలపడనుందీ జోడి.
ఇది చదవండి: ధోనీ రాకకై ఎదురు చూస్తున్న సర్ఫ్రైజ్