ETV Bharat / sports

సెమీస్​కు సింధు.. ప్రణీత్​, జయ్​రాం ఓటమి - స్విస్​ ఓపెన్ క్వార్టర్స్​లో భారత్

స్విస్​ ఓపెన్​లో శుక్రవారం భారత్​కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్​లో పీవీ సింధు సెమీస్​కు దూసుకెళ్లింది. మరోవైపు.. క్వార్టర్స్​లో పురుషుల ​సింగిల్స్​, మిక్స్​డ్​ డబుల్స్​లో భారత షట్లర్లు ఓటమి పాలయ్యారు.

satwik and ashwini crash out from swiss open tournament
సెమీస్​కు సింధు.. ప్రణీత్​, జయ్​రాం ఓటమి
author img

By

Published : Mar 5, 2021, 9:01 PM IST

Updated : Mar 5, 2021, 11:02 PM IST

స్విస్​ ఓపెన్​లో భారత షట్లర్లకు శుక్రవారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

ఒలింపిక్​ విజేత పీవీ సింధు.. క్వార్టర్స్​లో 21-16, 23-21 తేడాతో థాయ్​లాండ్​కు చెందిన బుసానన్​పై వరుస సెట్లలో గెలిచింది. సెమీఫైనల్లో డెన్మార్క్​ క్రీడాకారిణి మియాతో తలపడనుంది.

ప్రణీత్​, జయ్​రామ్​కు నిరాశ..

సింధు తప్ప మిగతా వారంతా నిరాశపరిచారు.

మిక్స్​డ్​ డబుల్స్​ క్వార్టర్స్​లో సాత్విక్ సాయిరాజ్- అశ్విని పొన్నప్ప ద్వయం ఓడింది. మలేసియా జోడీ టాన్ కియాన్ మెంగ్, లై పే జింగ్​ చేతిలో 17-21, 21-16, 18-21 తేడాతో పరాజయం పాలయ్యారు.

పురుషుల సింగిల్స్ క్వార్టర్​ ఫైనల్లో గతేడాది రన్నరప్ సాయి ప్రణీత్​ కూడా వరుస సెట్లలో చిత్తయ్యాడు. మలేసియా షట్లర్​ చేతిలో 14-21, 17-21 తేడాతో ఓడిపోయాడు. ​

మరో సింగిల్స్​ ఆటగాడు.. అజయ్ జయరామ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. థాయ్​ షట్లర్.. 21-9, 21-6 తేడాతో అజయ్​ని ఓడించాడు.

ఇదీ చదవండి:స్విస్​ ఓపెన్: సైనా, కశ్యప్ నిష్క్రమణ

Last Updated : Mar 5, 2021, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.