థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత్‌కు గురువారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్.. రెండో రౌండ్లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మరో ఆటగాడు సాయి ప్రణీత్ మాత్రం క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.
-
Champion of 2017 @saiprneeth92 is on course, defeated compatriot @deysubhankar06 21-18, 21–19 to eye the second #ThailandOpenSuper500 title of his career.
— BAI Media (@BAI_Media) August 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Well done champ!👏
Go for the GOLD!#IndiaontheRise #badminton pic.twitter.com/9woJZib8hl
">Champion of 2017 @saiprneeth92 is on course, defeated compatriot @deysubhankar06 21-18, 21–19 to eye the second #ThailandOpenSuper500 title of his career.
— BAI Media (@BAI_Media) August 1, 2019
Well done champ!👏
Go for the GOLD!#IndiaontheRise #badminton pic.twitter.com/9woJZib8hlChampion of 2017 @saiprneeth92 is on course, defeated compatriot @deysubhankar06 21-18, 21–19 to eye the second #ThailandOpenSuper500 title of his career.
— BAI Media (@BAI_Media) August 1, 2019
Well done champ!👏
Go for the GOLD!#IndiaontheRise #badminton pic.twitter.com/9woJZib8hl
ఏడో సీడ్ సైనా నెహ్వాల్.. జపాన్‌కు చెందిన సయాకా తకాషి చేతిలో 21-16, 11-21, 14-21 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.
ఐదో సీడ్ శ్రీకాంత్.. థాయ్‌లాండ్‌కు చెందిన కోషిట్ పెత్ప్రదాబ్ చేతిలో 21-11, 16-21, 12-21 పాయింట్ల తేడాతో ఓటమి పాలై ఇంటిముఖం పట్టాడు. ఇతడి బాటలోనే పారుపల్లి కశ్యప్.. చైనీస్ తైపీ క్రీడాకారుడు చౌ టైన్ చెన్ చేతిలో ఓడిపోయాడు.
గత వారం జపాన్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన సాయిప్రణీత్.. ఈ టోర్నీలోనూ అదే ఫామ్ కొనసాగిస్తూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. శుభంకర్పై 21-18, 21-19 తేడాతో గెలిచాడు.
పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్‌లో జెర్రీ చోప్రా- సిక్కి రెడ్డి జోడి.. హాంకాంగ్‌కు చెందిన టాంగ్ మన్-సే యింగ్ సూట్ చేతిలో ఓడారు.
ఇది చదవండి: థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి సైనా ఔట్