కరోనాపై పోరాటానికి బ్యాడ్మింటన్ ఆటగాడు సాయి ప్రణీత్ రూ.4 లక్షలు విరాళమిచ్చాడు. రూ.3 లక్షలు ప్రధాన మంత్రి సహాయనిధికి, రూ.1 లక్ష తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తున్నట్లు తెలిపాడు.
"కొవిడ్-19పై పోరాటంలో నా వంతు సాయంగా ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.3 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1 లక్ష విరాళంగా అందించా. ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో నా సాయం దేశానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నా" అని ప్రణీత్ ట్వీట్ చేశాడు.