ETV Bharat / sports

కరోనా దెబ్బకు రెండు బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు - కొవిడ్ లేటేస్ట్ న్యూస్

కరోనా పరిస్థితుల దృష్ట్యా అంతర్జాతీయంగా జరగాల్సిన రెండు టోర్నీలో రద్దు చేసినట్లు బీడబ్ల్యూఎఫ్ స్పష్టం చేసింది. వాటిలో ఇండోనేసియా మాస్టర్స్, రష్యన్ ఓపెన్ ఉన్నాయి.

Russian Open, Indonesia Masters called off due to COVID
కరోనా దెబ్బకు రెండు బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు
author img

By

Published : Apr 5, 2021, 9:07 PM IST

కొవిడ్ మరోసారి ప్రభావం చూపుతున్న దృష్ట్యా.. ఈ ఏడాది జరగాల్సిన రెండు బ్యాడ్మింటన్​ టోర్నీలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య, సోమవారం ప్రకటించింది. కొవిడ్ ఆంక్షలు, సమస్యల వల్ల ఆ పోటీలను రద్దు చేయడం తప్ప నిర్వహకులకు మరో దారి కనిపించలేదని తెలిపింది.

జులై 20 నుంచి 25వ తేదీల్లో జరగాల్సిన రష్యన్ ఓపెన్, అక్టోబరు 5-10 మధ్య జరగాల్సిన ఇండోనేసియా మాస్టర్స్ రద్దయిన టోర్నీల జాబితాల్లో ఉన్నాయి. వీటితో పాటే కెనడా ఓపెన్ కూడా రద్దయింది. దీంతో ఆగస్టు 24న ప్రారంభం కావాల్సిన హైదరాబాద్​ ఓపెన్​పై సందేహాలు నెలకొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.