PV Sindhu News: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్ కమిషన్ సభ్యురాలిగా దిగ్గజ షట్లర్ పీవీ సింధు సోమవారం ఎంపికైంది. బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ కమిషన్ 2021-2025కి ఆరుగురు సభ్యులను ప్రకటించింది. అందులో సింధు ఒకరు. ఈ ఐదుగురు సభ్యులతో కలిసి 2025 వరకు సింధు సేవలు అందించనుంది.
ఐరిస్ వాంగ్ (యూఎస్ఏ), రాబిన్ టాబెలింగ్ (నెదర్లాండ్), గ్రేసియా పోలి (ఇండోనేషియా), కిమ్ సోయోంగ్ (సౌత్‌కొరియా), పీవీ సింధు (ఇండియా), జెంగ్ సి వీ (చైనా)లను బీడబ్ల్యూఎఫ్ నియమించింది. ఆరుగురు సభ్యులలోనే ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌ను నిర్ణయిస్తారు.
BWF World Championships: 2016లో రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు.. టోక్యో గేమ్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్యాలు, రెండు రజతాలతో పటు ప్రతిష్టాత్మకమైన స్వర్ణాన్ని గెలుచుకుంది.
ఇదీ చదవండి: