ETV Bharat / sports

థామస్ ఉబర్​ కప్​లో ఆడేందుకు సింధు అంగీకారం

డెన్మార్క్​ వేదికగా జరగబోయే థామస్ ఉబర్ కప్​లో పాల్గొనేందుకు అంగీకారం తెలిపింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. బాయ్ ప్రెసిడెంట్ హిమంత బిశ్వ శర్మ వినతి మేరకు ఈ టోర్నీలో ఆడేందుకు ఒప్పుకుంది.

PV Sindhu agrees to play in Thomas Uber Cup
థామస్ ఉబెర్​ కప్​లో ఆడేందుకి సింధు అంగీకారం
author img

By

Published : Sep 7, 2020, 7:36 PM IST

డెన్మార్క్​లో జరగనున్న థామస్​ ఉబర్​కప్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్ నుంచి స్టార్​ షట్లర్​ పీవీ సింధు తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విషయమై సింధుకు నచ్చజెప్పిన భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రెసిడెంట్ హిమంత బిశ్వ శర్మ ఆమెను ఒప్పించినట్లు తెలిపారు. ఈ టోర్నీలో సింధు ఆడుతుందని స్పష్టం చేశారు.

"థామస్ ఉబర్​ కప్​లో ఆడాలని పీవీ సింధును కోరా. మనకు అనుకూలమైన డ్రా వచ్చిందని, పతకం గెలిచే అవకాశం ఉందని చెప్పా. ఇందుకు సింధు అంగీకరించింది. ఆమె ఈ టోర్నీలో ఆడుతుంది."

- హిమంత బిశ్వ శర్మ, బాయ్ ప్రెసిడెంట్

ఇంతకుముందు అనివార్య కారణాల వల్ల టోర్నీ నుంచి సింధు తప్పుకున్నట్లు ఆమె తండ్రి వెల్లడించారు.

షెడ్యూల్​ ప్రకారం మార్చిలో జరగాల్సిన ఈ టోర్నీ.. కరోనా ప్రభావంతో అక్టోబరు 3 నుంచి 11 మధ్య నిర్వహించనున్నారు. సింధు ప్రస్తుతం, గోపీచంద్​ అకాడమీలో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్​, సిక్కి రెడ్డిలతో కలిసి శిక్షణ తీసుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.