ETV Bharat / sports

బాయ్​ను క్షమాపణలు కోరిన ప్రణయ్​ - gopichand latest news

భారత షట్లర్​ హెచ్​. ఎస్​ ప్రణయ్..​ భారత బ్యాడ్మింటన్​ సంఘం (బీఏఐ)ను క్షమాపణలు కోరాడు. ఇటీవలే అర్జున అవార్డుకు తనను సిఫార్సు చేయనందుకు బాయ్​పై విమర్శలు గుప్పించాడు ప్రణయ్. దీనిపై వివరణ ఇవ్వాలని షో కాజ్ నోటీసులు పంపించగా.. ప్రణయ్​ స్పందించాడు.

Prannoy apologises for outburst against BAI
బాయ్​ను క్షమాపణలు కోరిన ప్రణయ్​
author img

By

Published : Jun 23, 2020, 10:44 PM IST

అర్జున అవార్డుకు తన పేరును సిఫార్సు చేయకపోవడం వల్ల జాతీయ సమాఖ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత షెట్లర్​ హెచ్​.ఎస్ ప్రణయ్​... భారత బ్యాడ్మింటన్​ సంఘం (బీఏఐ)ను క్షమాపణలు కోరాడు. బీఏఐ అధ్యక్షుడు హిమంత విశ్వ శర్మ.. ప్రణయ్​ క్షమాపణను అంగీకరించారు. ఇటువంటి ఘటన పునరావృతం కాదని భావిస్తున్నట్లు జనరల్ సెక్రెటరీ అజయ్​ సింఘానియా పేర్కొన్నారు.

మరోవైపు ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు భారత షట్లర్​ హెచ్​.ఎస్​ ప్రణయ్​ పేరును ప్రతిపాదించాలని సూచించారు బ్యాడ్మింటన్​ కోచ్​ పుల్లెల గోపిచంద్​.

జరిగిందేమిటంటే..

జూన్ 2న సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, సమీర్‌ వర్మ పేర్లను అర్జున అవార్డు కోసం కేంద్రానికి పంపించింది బాయ్​. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడటం వల్ల వరుసగా రెండో ఏడాది ప్రణయ్​ పేరును సిఫార్సు చేయలేదు బీఏఐ. ఈ నేపథ్యంలోనే అర్జున అవార్డుకు తన పేరును ప్రతిపాదించకపోవడం వల్ల ప్రణయ్​ విమర్శలు గుప్పించాడు. దీనిపై స్పందించిన బీఏఐ.. షోకాజ్​ నోటీసులను జారీ చేసింది.

ఇదీ చూడండి:'అర్జున అవార్డుకు ప్రణయ్​ను నామినేట్​ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.