ETV Bharat / sports

సైనా నిర్ణయంలో మా ప్రమేయం లేదు: పీపీబీఏ - Prakash Padukone Academy Did-Not Force Saina Nehwal

గోపీచంద్ అకాడమీని సైనా నెహ్వాల్ వీడడంలో తమ ప్రమేయమేమీ లేదని ప్రకాశ్ పదుకొణె బ్యాడ్మింటన్ అకాడమీ తెలిపింది. గోపీపై తమకు చాలా గౌరవం ఉందని వివరణ ఇచ్చింది.

Prakash
సైనా
author img

By

Published : Jan 14, 2020, 11:06 PM IST

గోపీచంద్‌ అకాడమీని వీడాలన్న నిర్ణయం సైనా నెహ్వాల్‌ స్వయంగా తీసుకుందని ప్రకాశ్‌ పదుకొణె బ్యాడ్మింటన్‌ అకాడమీ (పీపీబీఏ) తెలిపింది. ఆమె నిర్ణయంలో తమ జోక్యమేమీ లేదని స్పష్టం చేసింది. తన అకాడమీని వీడేందుకు ప్రకాశ్‌, విమల్‌, విరెన్‌ రస్కిర్హాయే సైనాను ప్రోత్సహించారని గోపీచంద్ ఇటీవల అన్నాడు. త్వరలో విడుదల కానున్న తన బయోగ్రఫీ 'డ్రీమ్స్‌ ఆఫ్‌ ఏ బిలియన్‌: ఇండియా అండ్‌ ద ఒలింపిక్‌ గేమ్స్‌' పుస్తకంలో 'బిట్టర్‌ రైవల్‌రీ' అనే అధ్యాయంలో గోపీచంద్‌ దీని గురించి వెల్లడించాడు.

గోపీ వ్యాఖ్యలను పదుకొణె అకాడమీ తోసిపుచ్చింది. "బెంగళూరులో పీపీబీఏ కేంద్రంలో శిక్షణ తీసుకోవాలన్న సైనా నిర్ణయంలో మా పాత్రేమీ లేదు. ఫామ్‌ కోల్పోయి కష్టాల్లో పడ్డ సైనాకు విమల్‌ కుమార్‌ సాయం చేశారు" అని తెలిపింది. ప్రకాశ్‌ సర్‌ తన గురించి ఆమెకు సానుకూలంగా చెప్పలేదన్న వ్యాఖ్యలపైనా వివరణ ఇచ్చింది. "ఆటగాడిగా కోచ్‌గా భారత బ్యాడ్మింటన్‌కు ఎంతో సేవ చేసిన గోపీచంద్‌పై పీపీబీఏకు గౌరవం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అతడు సాధించిన విజయాలకు మేం గర్విస్తున్నాం. అతడితో ఎప్పటికీ సత్సంబంధాలనే కొనసాగించాం. మా అకాడమీ నుంచి ఎంతో మంది షట్లర్లు ఎదిగారు. వెళ్లిపోయారు. వారి ఎదుగుదలను అడ్డుకొనే విధానమేమీ మాకు లేదు" అని పదుకొణె అకాడమీ వెల్లడించింది.

ఇవీ చూడండి.. నోటి దురుసు అభిమానిపై కివీస్ బోర్డు నిషేధం

AP Video Delivery Log - 1000 GMT News
Tuesday, 14 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0954: Hong Kong Lam 2 AP Clients Only 4249212
Lam: Hong Kong will rebound from social unrest
AP-APTN-0917: US DC Trump White House AP Clients Only 4249208
President Trump returns to White House
AP-APTN-0908: Iran Rouhani No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4249206
Rouhani calls for special court for plane crash
AP-APTN-0900: Lebanon Protest AP Clients Only 4249205
Protesters block highways and streets in Beirut
AP-APTN-0851: China MOFA Briefing AP Clients Only 4249204
DAILY MOFA BRIEFING
AP-APTN-0820: US Storm Damage Part must credit WPDE; No access Florence/Myrtle Beach; No use US broadcast networks; No re-sale, re-use or archive; Part must credit WTVD; No access Raleigh; No use US broadcast networks; No re-sale, re-use or archive 4249203
Tornado, severe storms strike Carolinas
AP-APTN-0811: Japan Finance Minister No access Japan; Part no access Sipa 4249202
Gaffe-prone Aso under fire for remarks on Japan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.