ETV Bharat / sports

కిదాంబి శ్రీకాంత్​కు మోదీ సహా పలువురి ప్రశంసలు - కిదాంబి శ్రీకాంత్​ సచిన్ ప్రశంసలు

Kidambi Srikanth Modi: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో రజత పతకం సాధించిన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్​పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీతో సహా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్​ ఇతడిని మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు.

Modi praises kidambi srikanth, sachin praises kidambi srikanth, కిదాంబి శ్రీకాంత్ మోదీ, కిదాంబి శ్రీకాంత్ సచిన్
kidambi srikanth
author img

By

Published : Dec 20, 2021, 5:02 PM IST

Kidambi Srikanth Modi: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. శ్రీకాంత్ గెలుపు ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

"ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన శ్రీకాంత్‌కు అభినందనలు. ఈ విజయం ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. బ్యాడ్మింటన్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది" అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

Kidambi Srikanth Sachin: కాగా, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా శ్రీకాంత్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అలాగే, క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సహా మరికొందరు ప్రముఖులు శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపారు.

  • ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం పొంది, ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా నిలిచిన శ్రీ కిడాంబి శ్రీకాంత్ కు అభినందనలు. తను భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. @srikidambi #BWFWorldChampionships2021

    — Vice President of India (@VPSecretariat) December 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత ఆటగాడి అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం గమనార్హం. ఇంతకు ముందు ప్రకాశ్‌ పదుకొణె (1983), భమిడిపాటి సాయిప్రణీత్‌ (2019) కాంస్యాలు సాధించారు. ఈ ఏడాది డబ్ల్యూటీఎఫ్‌లో రజత పతకం సాధించిన శ్రీకాంత్‌ భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

ఇవీ చూడండి: అలా ఔటయ్యావేంటి బట్లర్.. చూస్కొని ఆడాలిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.