ETV Bharat / sports

ఓర్లీన్​ మాస్టర్స్: సైనా ఔట్​-​ ఫైనల్స్​కు​ పురుషుల​ జోడీ - క్రిష్ణ ప్రసాద్​-విష్ణు వర్ధన్​

ఓర్లీన్​ మాస్టర్స్​లో భారత పురుషుల డబుల్స్​ జోడీ క్రిష్ణ ప్రసాద్​-విష్ణు వర్ధన్​ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీస్​లో ఇంగ్లాండ్ జంటపై విజయం సాధించింది ఈ భారత ద్వయం. మరో స్టార్ షట్లర్​ సైనా నెహ్వాల్​ సెమీస్​లో ఓటమి పాలైంది.

Orleans Masters: Doubles pair of Krishna-Vishnu march into final
ఓర్లీన్​ మాస్టర్స్​ ఫైనల్స్​కు​ భారత పురుషుల​ జోడీ
author img

By

Published : Mar 27, 2021, 6:06 PM IST

Updated : Mar 27, 2021, 7:16 PM IST

పారిస్​ వేదికగా జరుగుతున్న ఓర్లీన్​ మాస్టర్స్​ సెమీస్​లో భారత్​కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల డబుల్స్​ జోడీ ముందడుగు వేయగా.. మహిళల జోడీ ఓటమిపాలైంది.

ఇంగ్లాండ్​కు చెందిన కల్లమ్​ హెమ్మింగ్​-స్టీవ్​ స్టాల్​వుడ్​ జంటను ఓడించి.. క్రిష్ణ ప్రసాద్​-విష్ణు వర్ధన్ ఫైనల్​లోకి దూసుకెళ్లారు. 35 నిమిషాల పాటు సాగిన ఆటలో 21-17, 21-17 తేడాతో రెండు వరుస రౌండ్లలో ప్రత్యర్థి జోడీని మట్టికరిపించింది భారత ద్వయం. ఆదివారం ఫైనల్ మ్యాచ్​​ జరగనుంది.

సైనా ఓటమి..

భారత సింగిల్స్​ ప్లేయర్​ సైనా నెహ్వాల్​.. ఓర్లీన్​ మాస్టర్స్​ నుంచి నిష్క్రమించింది. సెమీ ఫైనల్లో డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టోఫర్సన్​తో తలపడిన సైనా.. 21-17, 21-17 తేడాతో పరాజయం పాలైంది. కేవలం 28 నిమిషాల పాటు సాగిన ఆటలో సైనాను ఎక్కడా కోలుకోనివ్వలేదు ప్రత్యర్థి.

మహిళల జోడీ పరాజయం..

భారత మహిళల డబుల్స్​ జంట అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి సెమీస్​లో ఓటమి పాలైంది. థాయ్​లాండ్​ జోడీ జోంగ్‌కోల్ఫాన్ కితితారకుల్-రవిందా ప్రజోంగ్​.. 21-18, 21-8తో భారత మహిళల డబుల్స్​ జంటపై విజయం సాధించింది.

ఇదీ చదవండి: ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ కొత్త జెర్సీ ఇదే

Last Updated : Mar 27, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.