పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు కెంటో మొమోటాకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో జపాన్ ఆటగాడు థాయ్‌లాండ్ ఓపెన్‌కు దూరం కానున్నాడని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ పేర్కొంది.
ప్రమాదంలో కంటికి గాయం అయిన కారణంగా దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన మొమోటా.. థాయ్‌లాండ్ ఓపెన్‌తో రీఎంట్రీ ఇవ్వాలని అశించాడు. ఈ తరుణంలో బ్యాంకాక్ వెళ్లే క్రమంలో .. జపాన్ ఆటగాడికి టోక్యోలోని నరిత విమానాశ్రయంలో చేసిన టెస్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ థాయ్‌లాండ్ స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ పర్యటన నుంచి జపాన్ దూరం కానుంది.
ఇదీ చదవండి:జట్టుతోనే సిడ్నీకి 'ఐసోలేషన్ ఆటగాళ్లు'