ETV Bharat / sports

సింధు దూకుడు.. ఒలింపిక్స్​ క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశం - JAPAN

ఒలింపిక్స్​ స్వర్ణపతకంపై గురిపెట్టిన భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధు.. క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రీక్వార్టర్స్​లో డెన్మార్క్​ షట్లర్​ను వరుస సెట్లలో ఓడించింది.

PV SINDHU
పీవీ సింధు
author img

By

Published : Jul 29, 2021, 7:02 AM IST

Updated : Jul 29, 2021, 9:52 AM IST

భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధు ఒలింపిక్స్​లో దూసుకెళ్తోంది. స్వర్ణపతకంపై గురిపెట్టిన ఈ షట్లర్​.. క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్​లో డెన్మార్క్​ క్రీడాకారిణి మియా బ్లిక్​ఫెల్ట్​ను వరుస సెట్లలో చిత్తు చేసింది.

మ్యాచ్​ ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన సింధు.. 21-15, 21-13 తేడాతో గెలిచింది.

క్వార్టర్స్​లో సింధుకు.. జపాన్​ షట్లర్​ అకానె యమగూచి ఎదురయ్యే అవకాశముంది.

సింధుపైనే పతక ఆశలు..

26 ఏళ్ల ఈ భారత స్టార్​ షట్లర్​.. 2016 రియో ఒలింపిక్స్​లో రజత పతక విజేత. బ్యాడ్మింటన్​లో భారత్​ నుంచి ఒలింపిక్స్​లో ఇంకా నిలిచింది సింధు మాత్రమే. ఈమెపైనే భారీగా అంచనాలున్నాయి.

పురుషుల సింగిల్స్​లో సాయి ప్రణీత్​.. ఆడిన రెండు మ్యాచ్​ల్లో ఓడి ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించాడు. పురుషుల డబుల్స్​లో సాత్విక్​ సాయిరాజ్​- చిరాగ్​ షెట్టి ద్వయం.. మూడింట రెండు గెలిచినా క్వార్టర్స్​ చేరుకోలేక నిష్క్రమించింది.

ఇదీ చూడండి: నిరాడంబరతకు నిలువుటద్దం ఈ 'మణిపూస'

Last Updated : Jul 29, 2021, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.