భారత లెజెండరీ షట్లర్ నందు నాటేకర్(88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు గౌరవ్ వెల్లడించారు. "గత మూడు నెలల నుంచి నాన్న ఆరోగ్యం కొంచెం కొంచెంగా క్షీణిస్తూ వచ్చింది. నేడు(జులై 28) ఆయన కన్నుమూశారు" అని గౌరవ్ చెప్పారు. నందు మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
నాటేకర్.. మహారాష్ట్రలోని సంగ్లీలో జన్మించారు. 15 ఏళ్ల కెరీర్లో 100 జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్‌ను అందుకున్నారు. 1961లో అర్జున అవార్డు ఆయనను వరించింది.
1954లో ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 1956 మలేసియాలోని ఈవెంట్లో గెలిచి.. అంతర్జాతీయ ఈవెంట్లో విజయం సాధించిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుకెక్కారు. 1951, 1963 మధ్య జరిగిన థామస్ కప్‌లో 16 డబుల్స్ మ్యాచుల్లో 8, 16 సింగిల్స్ మ్యాచుల్లో 12 గెలిచారు. 1965 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: టీమ్ఇండియాకు షాకిచ్చిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మృతి