ETV Bharat / sports

కరోనా వల్ల స్వీయ నిర్బంధంలో ఉన్నా: పుల్లెల గోపీచంద్

కరోనా​ వ్యాప్తి నియంత్రణకు ప్రపంచదేశాలు అనేక చర్యలు తీసుకుంటుంటే.. ఇంగ్లాండ్​ ప్రభుత్వం వాటిలో విఫలమైందని బాడ్మింటన్​ కోచ్​ పుల్లెల గోపీచంద్​ అన్నాడు. ఇంగ్లాండ్​ ఛాంపియన్​షిప్​ నుంచి వచ్చిన తర్వాత ఎవరినీ కలవకుండా ఫామ్​హౌస్​కే పరిమితమయ్యానని చెప్పాడు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తన అకాడమీని ఈ నెల చివరి వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించాడు​.

I was in self-restraint: Badminton coach pullela gopichand
'ఆ విషయంలో ఇంగ్లాండ్​ ప్రభుత్వం విఫలమైంది'
author img

By

Published : Mar 17, 2020, 7:39 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ విషయంలో ఇంగ్లాండ్‌ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోలేదని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ విమర్శించాడు. ఐరోపాలోని మిగతా దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. ఇంగ్లాండ్‌ ప్రభుత్వం మాత్రం కరోనా మహమ్మారి తీవ్రతను గుర్తించడంలో విఫలమైందని అన్నాడు.

ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగొచ్చిన గోపీచంద్‌.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరినీ కలవకుండా స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. ఇంటికైనా వెళ్లకుండా ఫామ్​హౌస్‌లో ఉంటున్నాడు. కరోనా వైరస్‌ లక్షణాలేవీ తనకు లేకపోయినా విదేశాల నుంచి రాగానే గోపీచంద్‌ స్వీయ నిర్బంధం విధించుకుని బాధ్యతాయుత పౌరుడినని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న గోపీచంద్‌.. ఇంగ్లాండ్​ ఛాంపియన్​షిప్​ గురించి చెప్పాడు.

"బర్మింగ్‌హామ్‌లో ఆల్‌ ఇంగ్లాండ్‌ టోర్నీ జరిగింది. వారం రోజులు అక్కడే ఉన్నాం. కరోనా మహమ్మారిపై ప్రపంచమంతా అప్రమత్తమైనా, ఇంగ్లాండ్‌ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదు. ముందు జాగ్రత్త చర్యలేవీ చేపట్టలేదు. ఆల్‌ ఇంగ్లాండ్‌ జరిగిన స్టేడియంలో 2000 మంది కూర్చొని మ్యాచ్‌లు చూశారు. అందులో ఎవరెవరికి కరోనా వైరస్‌ ఉందో లేదో తెలియదు. ఐరోపాలోని మిగతా దేశాలు నియంత్రణ చర్యలు చేపట్టినా, ఇంగ్లాండ్‌ మాత్రం పట్టించుకోలేదు. అక్కడి ప్రభుత్వం సరిగా స్పందించలేదు. ఆ దేశంలో ఉన్న విదేశీయులు ఎప్పుడెప్పుడు స్వస్థలాలకు వెళ్దామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్‌, దుబాయ్‌లలో విమానాల రాకపోకలు 60 శాతానికి పైగా తగ్గిపోయాయి. పశ్చిమ దేశాల కంటే మన దేశంలో, మన రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు చర్యలు భేష్‌. అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం కరోనా విషయంలో సమర్థంగా వ్యవరించాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల కరోనా వైరస్‌ వ్యాపించడం లేదు. ప్రజల ఆరోగ్యం, భద్రత అన్నిటికంటే ముఖ్యం. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ల ఆరోగ్యమూ ముఖ్యమే. ఇంగ్లాండ్‌ నుంచి ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చా. కరోనా వైరస్‌ లక్షణాలు లేకపోయినా ఇంటికి వెళ్లకుండా.. విమానాశ్రయం నుంచి నేరుగా ఫామ్​హౌస్‌కు వచ్చా. నిన్నటి నుంచి ఎవరినీ కలవకుండా స్వీయ నిర్బంధంలో ఉన్నా. వారం రోజుల పాటు ఇలాగే ఉండాలని అనుకుంటున్నా. ఆ తర్వాతే బయటకు వస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు పాటించడం బాధ్యతాయుత పౌరుడిగా మన విధి. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య అత్యయిక స్థితి నెలకొంది. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలి. తెలంగాణ ప్రభుత్వం, భారత క్రీడాప్రాధికార సంస్థ, భారత బ్యాడ్మింటన్‌ సంఘం ఆదేశాల ప్రకారం ఇండోర్‌.. ఔట్‌డోర్‌ స్టేడియాల్ని మూసేయాలి. కాబట్టి గోపీచంద్‌ అకాడమీలు రెండింటిని ఈనెల 31 వరకు మూసేస్తున్నాం. బీడబ్ల్యూఎఫ్‌ అన్ని టోర్నీలను నెల రోజుల పాటు వాయిదా వేసింది. వచ్చే నెల 12 వరకు ఎలాంటి టోర్నీలు లేవు. క్రీడాకారులు రికవరీ అయ్యేందుకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉంది. మరో నెల రోజుల పాటు జాగ్రత్తగా ఉంటే కరోనా వైరస్‌ నియంత్రణలో మరింత పురోగతి కనిపిస్తుంది" -పుల్లెల గోపీచంద్​, బ్యాడ్మింటన్ కోచ్

ఇదీ చూడండి.. 'టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించే సత్తా అతడికే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.