ETV Bharat / sports

డెన్మార్క్ ఓపెన్: క్వార్టర్స్​కు సింధు, శ్రీకాంత్ ఔట్ - కిదాంబి శ్రీకాంత్

డెన్మార్క్ ఓపెన్​లో(Denmark Open 2021) స్టార్​ షట్లర్ పీవీ సింధు క్వార్టర్​ ఫైనల్స్​కు చేరుకుంది. గురువారం జరిగిన పోరులో థాయ్​లాండ్​ క్రీడాకారిణి బుసానన్​పై(PV Sindhu vs Busanan) విజయం సాధించింది. కాగా, పురుషుల సింగిల్స్​లో కిదాంబి శ్రీకాంత్.. జపాన్​ ఆటగాడు కెంటో చేతిలో ఓటమిపాలయ్యాడు.

sindhu, srikanth
సింధు, శ్రీకాంత్
author img

By

Published : Oct 21, 2021, 7:00 PM IST

Updated : Oct 21, 2021, 11:00 PM IST

డెన్మార్క్​ ఓపెన్​ సూపర్​ 1000 టోర్నీలో(Denmark Open 2021) భారత స్టార్​ షట్లర్ పీవీ సింధు క్వార్టర్​ ఫైనల్స్​కు చేరుకుంది. గురువారం జరిగిన పోరులో థాయ్​లాండ్​ క్రీడాకారిణి బుసానన్​తో(PV Sindhu vs Busanan) సుదీర్ఘంగా పోరాడింది. 21-16, 12-21, 21-15 తేడాతో ఆమెపై విజయం సాధించింది. మొదటి సెట్ గెలిచిన సింధుకు రెండో సెట్​లో చుక్కెదురైంది. దీంతో మ్యాచ్ మూడో సెట్​కు దారితీసింది. ఈ ఫైనల్ సెట్​లో బలంగా పుంజుకున్న సింధు.. ప్రత్యర్థిపై ఆధిపత్యం వహించి విజయం సాధించింది.

కాగా, పురుషుల సింగిల్స్​లో జపాన్​ ఆటగాడు కెంటో మొమొటా చేతిలో పరాజయం పాలయ్యాడు భారత షట్లర్ శ్రీకాంత్. 21-23, 9-21 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఇదీ చదవండి:

నేటి నుంచే డెన్మార్క్‌ ఓపెన్‌.. బరిలో సింధు

Denmark Open: రెండో రౌండ్​కు సింధు, శ్రీకాంత్

Last Updated : Oct 21, 2021, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.