స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జగజ్జేతగా నిలిచింది తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు. అయితే ఛాంపియన్‌గా నిలిచిన సింధుకు రూ.20 లక్షలు, సెమీస్‌లో నిష్క్రమించిన సాయి ప్రణీత్‌కు రూ.5 లక్షలు నజరానా ప్రకటిస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బాయ్) ట్వీట్ చేసింది.
"బాయ్ అధ్యక్షుడు హిమంత్ బిస్వా.. ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు రూ.20 లక్షలు, అద్భుతంగా ఆడినందుకు సాయి ప్రణీత్‌కు రూ.5 లక్షల నజరానా ప్రకటించారు. #bwfwordchampionship2019" -ట్విట్టర్లో భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్
ఈ టోర్నీలో తొలిసారి స్వర్ణం చేజిక్కుంచుకున్న భారత ప్లేయర్‌గా నిలిచింది సింధు. అదే విధంగా ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో అత్యధిక పతకాలు సాధించిన వారిలో చైనాకు చెందిన జంగ్ నింగ్(చైనా) సరసన నిలిచింది తెలుగుతేజం.
పురుషుల విభాగంలో సెమీస్‌లో అడుగుపెట్టిన సాయిప్రణీత్.. దాదాపు 36 ఏళ్ల తర్వాత కాంస్యం పతకం అందుకు భారతీయుడిగా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ప్రకాశ్ పదుకునే పేరిట ఉంది.
ఇవీ చదవండి: