ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విసిరిన సవాలును స్వీకరించి, గచ్చిబౌలిలోని తన అకాడమీ ఆవరణలోని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వల్ల తెలంగాణలో పచ్చదనం బాగా పెరిగిందని చెప్పారు. ప్రజల్లోనూ చాలా అవగాహన వచ్చిందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. షట్లర్లు సిక్కి రెడ్డి, మేఘన, అరుణ్ విష్ణులకు మొక్కలు నాటమని ఛాలెంజ్ విసిరారు.
