చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత పోరు ముగిసింది. స్టార్ క్రీడాకారిణులు సైనా, సింధు, సమీర్ వర్మ క్వార్టర్స్‌లో ఓడి ఇంటిముఖం పట్టారు. జపాన్‌కు చెందిన యమగూచి చేతిలో 13-21, 23-21, 16-21 తేడాతో ఓటమి పాలైంది సైనా.
చైనాకు చెందిన కాయ్ యాన్యాన్తో జరిగిన మ్యాచ్‌లో 19-21, 9-21 పాయింట్ల తేడాతో సింధు ఓడిపోయింది. ఆమె చేతిలో సింధు ఓడిపోవడం ఇదే తొలిసారి.
పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు చెందిన సమీర్ వర్మ.. రెండో సీడ్ షి యూకీ చేతిలో 10-21, 20-22 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు.