ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో భారత్‌కు శుక్రవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచిపై 16-21, 21-16, 21-19 తేడాతో నెగ్గింది. తొలి సెట్ ఓడినా.. ఆత్మవిశ్వాసం కోల్పోని సింధు విజయం సాధించింది. సెమీస్‌లో థాయ్‌లాండ్ షట్లర్ చోచువాంగ్‌తో తలపడనుంది.
పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్య సేన్ నిరాశపర్చాడు. నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్ చేతిలో 17-21, 21-16, 17-21 తేడాతో పోరాడి ఓడాడు. గురువారం ఫ్రాన్స్ ఆటగాడిపై గెలిచిన లక్ష్య సేన్.. అతిపిన్న వయసులో ఈ టోర్నీ క్వార్టర్స్‌కు చేరిన భారత పురుష షట్లర్‌గా ఘనత సాధించాడు.
ఆ జోడీలు ఇంటికి..
మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో.. అశ్విని పొన్నప్ప- సిక్కి రెడ్డి జోడీ.. నెదర్లాండ్స్ ద్వయం సెలెనా-చెర్ల్ చేతిలో 22-24, 12-21తో ఓడింది.
పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో చిరాగ్ షెట్టి- సాత్విక్ సాయిరాజ్ జంటపై 21-16, 11-21, 21-17 తేడాతో గెలిచారు డెన్మార్క్ షట్లర్లు.
ఇదీ చూడండి: డిస్కస్ త్రోలో జాతీయ రికార్డుతో ఒలింపిక్స్‌కు మరో అథ్లెట్