స్వచ్ఛమైన వినోదం, మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు. ఆయన చిత్రాల్లో 'యమలీల' ఓ సంచలనం. అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. హాస్యనటుడు అలీ, ఈ సినిమాతో కథానాయకుడిగా మారారు. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా 'యమలీల.. ఆ తర్వాత' పేరుతో ఓ ధారావాహిక తీస్తున్నారు. చిత్రంలో నటించిన అలీ, మంజు భార్గవి ఇందులోనూ తల్లీకొడుకులుగా నటిస్తున్నారు. యముడు పాత్రలో సుమన్ కనిపించనున్నారు. సెప్టెంబరు 21 నుంచి ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. దీనికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">