'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో భాగం నుంచి అప్డేేట్ వచ్చేసింది. బుధవారం (మే 19)ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదే విషయాన్ని స్టార్ హీరోయిన్ సమంత ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. హీరో నాగచైతన్య షేర్ చేశారు.
మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధానపాత్రలు పోషించిన ఈ సిరీస్ మొదటి భాగం ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. శ్రీకాంత్ తివారీగా మనోజ్ నటన విశేషంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్ అందించిన విజయోత్సాహంతో 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2ను తెరకెక్కించారు దర్శకద్వయం రాజ్, డీకే. ఇందులో అదనపు ఆకర్షణగా కథానాయిక సమంత నటించారు.
ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు గతంలో ప్రకటించింది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో. కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వెబ్‌సిరీస్‌ను జూన్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదీ చూడండి.. 'నా వ్యాఖ్యలతో 'కరోనా ఫ్యాన్స్' బాధపడొచ్చు!'