ETV Bharat / sitara

Bigg Boss Telugu 5: కన్నీళ్లు పెట్టుకున్న శ్రీరామ్‌.. ప్రియాంక ముద్దులు - Bigg Boss Priya Elimination

తెలుగు బిగ్​బాస్​ సీజన్​ 5 (Bigg Boss Telugu 5) విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. మరో 50 రోజుల పాటు సాగే ఈ సీజన్​లో ఎంత మంది హౌస్​లో నిలుస్తారు అనే సందేహం అందరిలో ఉంది. అయితే ప్రియాంక మాత్రం వచ్చే అన్ని రోజులు నేను బిగ్​బాస్​ హౌస్​లోనే ఉంటాను అని అంటోంది. ఇంకా మరిన్ని విషయాలు మీకోసం..!

Bigg Boss Telugu 5
బిగ్​బాస్​ తెలుగు 5
author img

By

Published : Oct 26, 2021, 11:12 AM IST

Updated : Oct 26, 2021, 12:03 PM IST

బిగ్‌బాస్‌ సీజన్‌-5 (Bigg Boss Telugu 5) సోమవారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మరో 50 రోజులు తాను ఇంట్లో ఉండాలనుకుంటున్నానని అనీ మాస్టర్‌తో ప్రియాంక చెప్పుకొచ్చింది. కన్ఫెషన్‌ రూమ్‌లో తన గురించి ఎందుకు నెగెటివ్‌గా చెప్పావని లోబోను రవి అడిగాడు. ఏదైనా ఉంటే ఇద్దరం నేరుగా మాట్లాడుకుంటే బాగుంటుందని అన్నాడు. అక్కడ లోబో అన్న మాటలకు రవి బాగా ఫీలైనట్లు ఉన్నాడు. అనీ మాస్టర్‌ కూడా లోబో మాటల పట్ల అసహనం వ్యక్తం చేసింది.

ప్రియమైన వారి నుంచి లేఖలు.. అందని వారు నామినేట్‌లు..

ఈసారి నామినేషన్‌ (Bigg Boss Elimination) ప్రక్రియను సరికొత్త డిజైన్‌ చేసింది బిగ్‌బాగ్‌ టీమ్‌. 'ఈ రోజు నుంచి మీకు ఎంతో ప్రియమైన వారి నుంచి ఒక లేఖను పొందే అవకాశం వస్తుంది. కానీ, జీవితంలో మనం కోరుకున్నది ప్రతిదీ, మనకు దక్కదు. దానికి బదులుగా ఏదైనా వదులుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే పవర్‌ రూమ్‌లో ఉన్న సభ్యులు లేఖను ఇస్తారో వారు ఈ వారం నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారు. లేఖ లభించని సభ్యులు నామినేట్‌ అవుతారు' అంటూ బిగ్‌బాస్‌ చెప్పాడు.

మొదటగా మానస్‌, శ్రీరామ్‌లు పవర్‌రూమ్‌లోకి వెళ్లి లేఖలు తీసుకొచ్చారు. అందులో లోబో, ప్రియాంకల లెటర్లు ఉన్నాయి. తన భార్య గర్భవతి అని, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని అంటూనే ప్రియాంక లెటర్‌ను ఆమెకు ఇచ్చేందుకు లోబో సులభంగానే ఓకే చెప్పేశాడు. ఆ తర్వాత షణ్ముఖ్‌, రవిలకు విశ్వ, సిరి లేఖలు వచ్చాయి. విశ్వ చెప్పిన కారణానికి సిరి ఓకే చెప్పేసి, లెటర్‌ ఇచ్చేసింది. 'నాకు పుట్టకపోయినా నా దగ్గర ఒక బాబు ఉన్నాడు. పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను'అంటూ సిరి కన్నీటి పర్యంతమైంది. విశ్వ లెటర్‌ను చదువుతూ భావోద్వేగానికి గురైంది.

ఆ తర్వాత కాజల్‌-ప్రియాంకలు పవర్‌రూమ్‌కి వెళ్లి తెచ్చిన లేఖల్లో అనీ మాస్టర్‌, మానస్‌ల లేఖలు ఉన్నాయి. మరో ఆలోచన లేకుండా మానస్‌ తన అవకాశాన్ని అనీ మాస్టర్‌కు ఇచ్చాడు. అనంతరం విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్‌ లేఖలు వచ్చాయి. ఈ సందర్భంగా మొదట శ్రీరామ్‌ తన లెటర్‌ను వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో రవిని ఉద్దేశించి లోబో మాట్లాడుతూ.. 'నీకు వదిన రాసిన లెటర్‌, పాప బొమ్మ, టీషర్టు ఉన్నాయి. పండగ సందర్భంగా వాళ్ల వీడియోను కూడా చూశావు. శ్రీరామ్‌కు కనీసం చూసే అవకాశం కూడా రాలేదు. అతనికి ఇచ్చేద్దాం' అని అనగా, రవి అందుకు ఒప్పుకొన్నాడు. శ్రీరామ్‌ తన లేఖ చదువుకుని భావోద్వేగానికి గురయ్యాడు. హౌస్‌లోకి వచ్చిన తర్వాత తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి దగ్గరకు వచ్చిన అనీ, ప్రియాంకలు శ్రీరామ్‌ను ఓదార్చేప్రయత్నం చేశారు. ప్రియాంక అతడిని హత్తుకుని ముద్దులు పెట్టింది.

అమ్మా నువ్వే నాకు స్ఫూర్తి: షణ్ముఖ్‌

అనంతరం అనీ, సిరిలు పవర్‌ రూమ్‌కు వెళ్లి తెచ్చిన లేఖల్లో కాజల్‌, షణ్ముఖ్‌ లెటర్లు వచ్చాయి. ఈ సందర్భంగా కాజల్‌ ఎమోషన్‌ను చూసిన షణ్ముఖ్‌ (Bigg Boss Shanmukh) తన లెటర్‌ను త్యాగం చేశాడు. 'అమ్మా.. క్యాన్సర్‌ సర్వైవ్‌ అయ్యావు.. అమ్మమ్మ చనిపోయినప్పుడూ సర్వైవ్‌ అయ్యావు.. నువ్వే నా ఇన్‌స్ప్రేషన్‌.. ఐ విల్‌ సర్వైవ్‌ దిస్‌' అంటూ షణ్ముఖ్‌ ఏడుస్తూ తనకొచ్చిన లెటర్‌ను త్యాగం చేశాడు. చివరిగా కెప్టెన్‌ సన్నీకి స్పెషల్‌ పవర్‌ లభించింది. జెస్సీ లెటర్‌ తీసుకొచ్చి, అది జెస్సీ చదవాలంటే ఇప్పటికే లెటర్‌ పొందిన వారు దాన్ని త్యాగం చేసి, నామినేషన్స్‌లో ఉండాలని బిగ్‌బాస్‌ చెప్పాడని వివరించాడు. దీంతో శ్రీరామ్‌ తన లెటర్‌ను త్యాగం చేశాడు. అయితే, మధ్యలో రవి కలగజేసుకుని, శ్రీరామ్‌తో షణ్ముఖ్‌, సిరి, జెస్సీల మధ్య దూరం ఏర్పడిందని, అది పోవాలంటే శ్రీరామ్‌ను హగ్‌ చేసుకోవాలని షరతు పెట్టాడు. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. తమ మధ్య సమస్యలు లేవీ లేవని చెప్పారు. చివరిగా కెప్టెన్‌ సన్నీకి ఎలాంటి కండీషన్స్‌ లేకుండా లెటర్‌ రావడంతో దాన్ని చదివి ఆనందం పడ్డాడు. అలా ఈ వారం రవి, లోబో, శ్రీరామ్‌, సిరి, షణ్ముఖ్‌, మానస్‌లు నామినేట్‌ అయ్యారు.

ఇదీ చూడండి: Megha Akash Birthday: కొంటె చూపులతో కిక్కెక్కిస్తున్న మేఘా ఆకాశ్

Last Updated : Oct 26, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.