తెలుగు టెలివిజన్ ఆవిర్భవించి ఐదు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా ఫిబ్రవరి 14న చిత్రీకరణలకు సెలవు ప్రకటిస్తూ... టెలివిజన్ టెక్నీషియన్స్ వర్కర్స్, ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో నివేదన సభ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఫేడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ తెలిపారు.
సభకు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. తెలుగు టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తున్న 21 యూనియన్ల కార్మికులంతా పాల్గొంటారని వెల్లడించారు. 5 దశాబ్దాల తెలుగు టెలివిజన్ ప్రస్థానాన్ని ప్రభుత్వాలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. దాంతో పాటు టీవీ కార్మికుల ఆరోగ్య భద్రత, నివాస స్థలాలు, టీవీ నగర్ ఏర్పాటు చేయాలనే తమ డిమాండ్లను విన్నవించనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: మేయర్ ఎన్నికలో కీలకంగా పతంగి... అసలు వ్యూహమేంటీ?