ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Ali to saradaga) కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన అలనాటి తారలు రోజారమణి, చక్రపాణి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇందులో భాగంగా తమ కుమారుడు, నటుడు తరుణ్(Actor Tarun).. స్విట్జర్లాండ్‌లో ఉన్న సమయంలో రూంలో అగరబత్తులు వెలిగించి పూజ చేస్తే, అగ్నిప్రమాదం జరిగిందేమోనని పోలీసులు వచ్చారని రోజారమణి గుర్తుచేసుకున్నారు. 'భక్తప్రహ్లాద' సినిమాలో తాను నటిస్తే భక్తి.. తన భర్త, తనయుడికి వచ్చిందన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"తరుణ్ పూజ చేస్తే ఎక్కువ కర్పూరాలు, అగరబత్తులు వెలిగిస్తాడు. దాంతో మా పూజ గది నల్ల రంగుగా మారిపోతుంది. ఎన్ని సార్లు రంగులేసిన మళ్లీ అదే తంతు. ఓ సారి వేసవికాలంలో తరుణ్ షూటింగ్‌కు సంబంధించి సరదాగా స్విట్జర్లాండ్‌కు వెళ్లాం. ఓ రోజు రూంమ్లోనే పూజ చేశాడు. ఎక్కువ కర్పూరం, అగరబత్తులు వెలిగిచ్చాడు. మొత్తం పొగ వచ్చేసింది. దాంతో ఏదో అయిపోయిందనుకుని పోలీసులు వచ్చేశారు. పూజ చేస్తున్నట్లు వారికి తరుణ్ వివరించాడు. ఇలా చెయ్యకూడదని నవ్వుతూ అన్నారు. అప్పటి నుంచి బయట వరండాలో పూజ చేసుకోవడం ప్రారంభించాడు."
-రోజారమణి, తరుణ్ తల్లి
ఒరిస్సాలో 'ఆమె', 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం' రీమేక్ సినిమాలకు దర్శకత్వం వహించినట్లు చెప్పారు చక్రపాణి. ఆ తర్వాత ఆయన ఎందుకు డైరెక్షన్ మానేశారో వివరించారు. ఆ తర్వాత రోజారమణి మాట్లాడుతూ.. " రెండు సినిమాలు చేసిన తర్వాత శ్రీపూరీజగన్నాథ్పై సినిమా లేదా సీరియల్ చేయాలనేది ఆయన కల. దాంతో దాని స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ అయిపోయారు. త్వరలో దాన్ని మొదలపెడతారు." అని అన్నారు.
తరుణ్ ఎలా ఉంటాడంటే..
తరుణ్ ఇతరులను ఎంతో గౌరవిస్తాడని, చాలా క్రమశిక్షణగా ఉంటాడని అన్నారు రోజారమణి, చక్రపాణి. "తరుణ్ చాలా జాలీగా ఉంటాడు. తనకన్నా పెద్దవారిని బాగా గౌరవిస్తాడు. మమల్ని బాగా చూసుకుంటాడు. అతడు జాతీయ అవార్డు తీసుకున్న సందర్భం మా జీవితంలో ఎంతో ఆనందమైన క్షణం." అని తరుణ్‌ను ప్రశంసించారు.
ఇదీ చూడండి: ఈటీవీతో మా అనుబంధం మాటల్లో చెప్పలేము!