ETV Bharat / sitara

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం - మనసుమమత సీరియల్​ నటి ఆత్మహత్య

SR nagar Polices negligence in TV actress Shravan's suicide case
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం
author img

By

Published : Sep 9, 2020, 8:53 AM IST

Updated : Sep 9, 2020, 9:42 AM IST

08:48 September 09

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఎస్సార్​ నగర్​ పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. దేవరాజురెడ్డి తనని వేదిస్తున్నాడంటూ జూన్ 22న ఎస్సార్​ నగర్ పోలీసులకు శ్రావణి ఫిర్యాదు చేసింది. గతంలో టిక్​టాక్​లో పరిచయమైన దేవరాజు రెడ్డిని శ్రావణి ప్రేమించింది. అతని నిజస్వరూపం తెలిసి అతడికి దూరంగా ఉంది. అయితే అనంతరం డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు.

శ్రావణి వ్యక్తిగత ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించడం ప్రారంభించాడు. లక్ష రూపాయలు ఇస్తే.. ఫోటోలు డిలీట్​ చేస్తానని దేవరాజు.. శ్రావణితో చెప్పాడు. అందుకు ఒప్పుకున్న శ్రావణి విడతల వారిగా గూగుల్​ పే ద్వారా నగదు పంపింది. డబ్బులు పంపించినప్పటికీ.. వేధింపులు ఆగలేదు. ఈ విషయంపై శ్రావణి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఇవాళ ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు.

Last Updated : Sep 9, 2020, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.