ETV Bharat / sitara

'ఇంకోసారి అలా చేస్తే మద్రాసులో ఉండవన్నారు' - ఆలీతో సరదాగా మనో, జమీలా

ప్రముఖ సింగర్​ మనో(singer mano)ను ఓ వ్యక్తి 'ఇంకోసారి ఇలా చేశావంటే మద్రాసులో ఉండవు' అని అన్నారట. అసలు ఆ వ్యక్తి ఎవరు? అలా ఎందుకు అన్నారు? అనేది తెలుసుకోండి.

Singer Mano
మనో
author img

By

Published : Sep 7, 2021, 4:34 PM IST

తను ఓ సందర్భంలో స్వరాలు చెబితే.. అది విన్న విజయకృష్ణ మూర్తి అనే వ్యక్తి 'ఇంకోసారి ఇలా చేశావంటే మద్రాసులో ఉండవు' అని అన్నారని ప్రముఖ గాయకుడు మనో(alitho saradaga mano) తెలిపారు. 'ఆలీతో సరదాగా'(alitho saradaga latest episode) కార్యక్రమానికి సతీసమేతంగా విచ్చేసిన ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ప్రతి మంగళవారం ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమం ఇది. ఈ నెల 13న టెలీకాస్ట్‌ కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మనో పాటలు, ఆయన సతీమణి జమీలా మాటలతో ఆద్యంతం అలరిస్తోంది.

'మనో, జమీలా మీ పరిచయం ఎలా మొదలైంది?' అని ఆలీ అడగ్గా జమీలా చెప్పిన సమాధానం ఆకట్టుకుంటుంది. "ఆయన పాడిన అన్ని పాటలూ(singer mano songs) నాకు బాగా ఇష్టం. వాటిల్లో 'ప్రియా ప్రియతమా రాగాలు' ఎక్కువ ఇష్టం" అని ఆమె తెలిపారు. ఇప్పటికీ రాత్రి 2- 3 గంటలకీ బిర్యానీ వండుతున్నట్టు చెప్పుకొచ్చారు. మనో మాట్లాడుతూ.. "ఓసారి గమపస పస అంటూ ఓ స్వరం రాశా. అది దర్శకుడు విశ్వనాథ్‌ గారికి నచ్చింది. 'విజయ కృష్ణమూర్తి.. వీడు చాలా బాగా రాస్తున్నాడే' అని చెప్పి, ఫోన్‌ మాట్లాడేందుకు వెళ్లారాయన. ఇంతలో విజయ కృష్ణమూర్తిగారు పిలిచి.. ఇంకోసారి స్వరం రాసావనుకో మద్రాసులో ఉండవు' అని అన్నారని మనో వివరించారు (నవ్వుతూ).

తనకి దూరమవుతాడనే కారణంగా ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి తనకు చాలాకాలం పాటలు ఇవ్వలేదని, ఈ విషయమై.. కొన్నాళ్ల తర్వాత చక్రవర్తి క్షమించమన్నారంటూ మనో గత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. ఆలీ నటించిన 'సోంబేరి' చిత్రానికి తొలిసారి సంగీత దర్శకుడిగా మారినట్టు చెప్పారు. అదే సినిమా వేడుకలో 'ఒకవేళ నాగూర్‌ బాబు (మనో) మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగితే నాకు ఇంతమంది నిర్మాతలు సినిమా అవకాశాలు ఇచ్చేవారు కాదేమో!' అని సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అభిప్రాయపడ్డారని తెలిపారు. రజనీకాంత్‌ నటించిన 'చంద్రముఖి'లోని సంభాషణలు చెప్పి మెప్పించారు. ఓ పద్యం ఆలపించారు. మనో పంచుకున్న విశేషాలన్నీ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో(alitho saradaga latest promo) చూసి ఆనందించండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: సెహ్వాగ్​ నోట పవన్​కల్యాణ్​ డైలాగ్​.. ఫ్యాన్స్​లో జోష్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.