ETV Bharat / sitara

మరో క్రేజీ ప్రాజెక్టులో సమంత.. ఈసారి గూఢచారి పాత్రలో! - సమంత ఐటమ్ సాంగ్

Samantha webseries: ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు మరో వెబ్ సిరీస్​లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈసారి గూఢచారిగా కనిపించనుందని సమాచారం.

Samantha Akkineni
సమంత
author img

By

Published : Dec 24, 2021, 8:07 PM IST

Samantha movie news: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే పలు చిత్రాలకు అంగీకరించిన ఆమె.. మరో ఆసక్తికర ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan)తో కలిసి ఆమె నటిస్తున్న అమెజాన్‌ ప్రైమ్‌ సిరీస్‌ 'సిటాడెల్‌'(Citadel). 'ఫ్యామిలీమ్యాన్‌' సృష్టికర్తలు రాజ్‌-డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు.

varun dhawan samantha
వరుణ్ ధావన్ సమంత

గూఢచర్యం నేపథ్యంలో ఈ కథ సాగనుందని సమాచారం. వరుణ్‌ ధావన్‌, సమంత తొలిసారి కలిసి నటిస్తుండగా.. ఇద్దరూ గూఢచారులుగా కనిపించనున్నారట. ఈ సిరీస్‌ సెట్స్‌పైకి వెళ్లే ముందు వరుణ్‌ ధావన్‌, సమంత ఇద్దరూ యాక్షన్‌ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు చాలా స్టైలిష్‌గా ఉంటాయని బాలీవుడ్‌ టాక్‌.

'అవెంజర్స్‌' వంటి సూపర్‌హీరో చిత్రాలకు దర్శకత్వం వహించిన రుస్సో బ్రదర్స్‌ దీన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ అమెజాన్‌ ప్రైమ్‌ సిరీస్‌ వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. అన్నట్లు ‘సిటాడెల్‌’ పేరుతో అమెరికాలో ఓ యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ తెరకెక్కుతోంది. దీన్ని కూడా రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రిచర్డ్‌ మ్యాడెన్‌, ప్రియాంక చోప్రా నటిస్తుండటం విశేషం.

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. భారతీయ ప్రేక్షకుల కోసం కొన్ని మార్పులతో ఆ సిరీస్‌ను వరుణ్‌, సమంతతో తెరకెక్కిస్తున్నారట. ఇటీవల ‘పుష్ప’లో ఐటమ్‌ సాంగ్‌లో అదరగొట్టిన సమంత.. ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలతో పాటు, ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే అంతర్జాతీయ చిత్రంలోనూ నటిస్తున్నారు.

samantha pushpa item song
సమంత 'పుష్ప'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.