బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్.. 'బిగ్‌బాస్ 14' కోసం సిద్ధమవుతున్నారు. కరోనా ప్రభావంతో పూర్తి జాగ్రత్తలతో ఈ కార్యక్రమం షూటింగ్ జరపనున్నారు. అయితే 12 వారాల పాటు జరిగే ఈ సీజన్ కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట సల్మాన్. ఈ మొత్తం దాదాపు రూ.250 కోట్ల వరకు ఉండనుందని టాక్. ఇదే నిజమైతే అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ వ్యాఖ్యాతగా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటికీ ప్రోమోలు విడుదలవగా, అక్టోబరు నుంచి షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
లాక్డౌన్ ప్రభావంతో ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సల్మాన్.. ఆ సమయంలో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి ఆల్బమ్ సాంగ్స్ చేశారు. భాయ్ నటిస్తున్న 'రాధే' సినిమా మిగిలిన చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే సంవత్సరం మొదట్లో జరిగే అవకాశముంది.