ETV Bharat / sitara

ఆ షోలో రామ్​చరణ్​ ఎంత గెలుచుకున్నారంటే? - ఎన్టీఆర్​ ఎవరు మీలో కోటీశ్వరులు

కథానాయకుడు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం​లో హీరో రామ్​చరణ్​ అతిథిగా విచ్చేశారు. సోమవారం జరిగిన కర్టెన్​ రైజర్​ రెండోభాగం​ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. చరణ్‌, తారక్‌, రానా.. ఈ ముగ్గురి మధ్య సాగిన సంభాషణ ఆకట్టుకుంది. ఈ షోలో హీరో రామ్​చరణ్​ రూ.25 లక్షలను గెలుచుకున్నారు.

evaru meelo koteeswarulu
ఆ షోలో రామ్​చరణ్​ ఎంత గెలుచుకున్నాడంటే..
author img

By

Published : Aug 24, 2021, 7:08 AM IST

బుల్లితెర కార్యక్రమం 'ఎవరు మీలో కోటీశ్వరులు' వేదికగా ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి సందడి చేశారు. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యహరిస్తోన్న ఈ షోలో తొలి కంటెస్టెంట్‌గా హీరో రామ్‌చరణ్‌ విచ్చేశారు. తొలి ఎపిసోడ్‌ ఆదివారం ప్రసారమై, ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచింది. అదే జోరును కొనసాగిస్తూ తదుపరి ఎపిసోడ్‌ సోమవారం వచ్చేసింది. రూ.1,60,000 విలువైన ప్రశ్నతో ప్రారంభమైన ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఓ ప్రశ్నకు సమాధానం తెలియక లైఫ్‌ లైన్‌ ద్వారా చెర్రీ.. కథానాయకుడు దగ్గుబాటి రానాను సంప్రదించారు. చరణ్‌, తారక్‌, రానా.. ఈ ముగ్గురి మధ్య సాగిన సంభాషణ ఆకట్టుకుంది. మరి ఏ ప్రశ్నకు సమాధానం కోసం చరణ్‌ రానాకు ఫోన్‌ చేశారు..? ఎంత మొత్తం గెలుచుకున్నారు? చూద్దామా.

9. జూన్‌ 2020లో ఇండియా- చైనా మధ్య వివాదం తలెత్తిన గల్వాన్‌ లోయ ఏ ప్రాంతంలో ఉంది?

ఎ) లద్దాఖ్‌ బి) హిమాచల్‌ ప్రదేశ్‌ సి) రాజస్థాన్‌ డి) అరుణాచల్‌ ప్రదేశ్‌

సమాధానం: లద్దాఖ్‌.

10. లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్ హాల్‌లో లైవ్‌ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించిన మొట్ట మొదటి భారతీయ చిత్రం ఏది?

ఎ) బాహుబలి: ది బిగినింగ్‌ బి) దంగల్‌ సి) 2.0 డి) కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 1

సమాధానం: బాహుబలి.

11. 1971 బంగ్లాదేశ్‌ యుద్ధం సమయంలో మునిగిపోయిన జలాంతర్గామి పి.ఎన్‌.ఎస్‌. ఘాజీ అసలు పేరేంటి?

ఎ) చెరోకీ బి) హెర్క్యులీస్‌ సి) ఫోర్డ్‌ డి) డియాబ్లో

సమాధానం: డియాబ్లో.

  • ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకే చరణ్ 'వీడియో కాల్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌' ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నారు. రానా సరైన సమాధానం చెప్పి చరణ్‌ను గెలిపించారు.

12. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సెబాస్టియన్‌ వెట్టెల్‌ 2021 సీజన్‌లో ఏ ఫార్ములా 1 టీమ్‌కు డ్రైవ్‌ చేస్తున్నారు?

ఎ) రెడ్‌బుల్‌ బి) విలియమ్స్ సి) ఆస్టన్‌ మార్టిన్‌ డి) మెక్‌లారెన్‌

సమాధానం: ఆస్టన్‌ మార్టిన్‌.

13. ఏ పాలకుడి దగ్గర బ్యూసిఫాలస్‌ అనే యుద్ధాశ్వం ఉండేది?

ఎ) అశోక ది గ్రేట్‌ బి) అక్బర్‌ ది గ్రేట్‌ సి)అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ డి) ఆల్ఫ్రెడ్‌ ది గ్రేట్‌

సమాధానం: అలెగ్జాండర్‌ ది గ్రేట్‌.

  • ఈ ప్రశ్నకు సమాధానం కోసం చరణ్‌ '50-50' లైఫ్‌ను వినియోగించుకున్నారు. సరైన సమాధానం చెప్పి రూ.25,00,000 గెలుచుకున్నారు. దాంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్‌ రైజర్‌ ముగిసింది. చరణ్ గెలుచుకున్న 25 లక్షలను చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు అందజేస్తున్నట్లు ఎన్టీఆర్‌ తెలిపారు.

ఇదీ చూడండి : బెల్లకొండ గణేశ్ జోరు.. 'తలైవి' విడుదల తేదీ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.