ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. మన దేశంలోని సినిమా, వెబ్ సిరీస్ ప్రేమికుల కోసం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. డిసెంబరు తొలి వారాంతంలో(5-6 తేదీల్లో) ఉచితంగా అన్ని సినిమా, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలను చూడొచ్చని వెల్లడించింది.
"మా(నెట్‌ఫ్లిక్స్‌లో) దగ్గర ఉన్న కొత్త కథలు, సిరీస్‌లతో పాటు మేం ఎలా పనిచేస్తున్నామో భారత్‌లో ఉన్న అందరికీ తెలియాలి. అందుకే డిసెంబరు తొలి వారాంతంలో నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా ఇస్తున్నాం" అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
మీ పేరు, ఈమెయిల్/ ఫోన్ నంబర్‌తో లాగిన్ అయితే సరిపోతుంది. అయితే ఒక ఫోన్ నంబర్‌తో ఒక అకౌంట్ మాత్రమే లాగిన్ అవ్వొచ్చు. ఎలాంటి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు.