ETV Bharat / sitara

యూట్యూబ్​ హోమ్​టూర్లపై 'జబర్దస్త్​'లో సెటైర్లు - ఎక్స్​ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో

'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో అలరిస్తోంది. అదే స్థాయిలో నవ్విస్తూ, ఎపిసోడ్​పై ఆసక్తి పెంచుతోంది. టీమ్​ లీడర్లు తమదైన పంచులతో అలరిస్తూ, ప్రోమోను రక్తి కట్టించారు.

jabardast latest promo
జబర్దస్త్​ ప్రోమో
author img

By

Published : Aug 20, 2021, 10:05 AM IST

Updated : Aug 20, 2021, 11:42 AM IST

ఈ మధ్య కాలంలో యూట్యూబ్​లో 'హోమ్​టూర్' వీడియోలు ఎక్కువయ్యాయి. చిన్నచితకా సెలబ్రిటీలు అందరూ తమ ఇంటిని వీడియోగా తీసి యూట్యూబ్​లో పెడుతున్నారు. ఇప్పుడు ఈ తరహా వీడియోలపై సెటైర్లు వేస్తూ 'జబర్దస్త్'లో రాకెట్​ రాఘవ చేసిన స్కిట్​ తెగ నవ్విస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలవగా, దానికి విశేష స్పందన వస్తోంది.

mano jabardast
జడ్జి మనో- రీతూ చౌదరి

జడ్జి మనోతో కలిసి స్కిట్​ చేసిన హైపర్ ఆది, తనదైన శైలి పంచులతో అలరించారు. 'మారి' గెటప్​లో వచ్చిన చలాకీ చంటి, తన హావభావాలతో మెప్పించారు. 'ఆషాడమాసం' కొత్త పెళ్లికొడుకులు స్కిట్​తో వెంకీ మంకీస్​ టీమ్​ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఎవరి పెళ్లికి అయినా సరే బంధువుల్ని అద్దెకిస్తామంటూ అదిరే అభి చేసిన స్కిట్​ ఆలోచింపజేస్తూ, నవ్విస్తోంది. ఇలా సందడి సందడిగా సాగిన ఈ ఎపిసోడ్​ను చూడాలంటే ఆగస్టు 26 రాత్రి 9:30 గంటల వరకు ఆగాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Aug 20, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.