ETV Bharat / sitara

స్వయంవరం పెడితే ఒక్కడినే కూర్చోవాలేమో: రాజ్​ తరుణ్ - raj tarun new movie

'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన హీరో రాజ్​తరుణ్.. తన షార్ట్ ఫిల్మ్స్​ గురించి, సినీ ప్రయాణం గురించి చెప్పాడు. వీటితో పాటే పలు సరదా సంగతులు పంచుకున్నాడు.

స్వయంవరం పెడితే ఒక్కడినే కూర్చోవలేమో: రాజ్​ తరుణ్

author img

By

Published : Oct 8, 2020, 10:19 AM IST

Updated : Oct 8, 2020, 10:57 AM IST

షార్ట్‌ ఫిల్మ్స్‌తో స్టార్ట్‌ అయి, సూపర్‌ హిట్‌ సినిమాల వరకూ తను నమ్ముకున్న కష్టమే తన వెనకున్న సక్సెస్‌ అని నిరూపించాడు. నేటివిటీ టచ్‌ ఉన్న పాత్రల్లో నటిస్తూ, అవార్డ్స్‌ను మించిన అభిమానాన్ని రివార్డును మించిన ఆదరణను సొంతం చేసుకున్నాడు. అతడే యువ హీరో రాజ్‌తరుణ్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా!

మీరు గుడ్‌ బాయ్‌? బ్యాడ్‌ బాయ్‌?

రాజ్‌ తరుణ్‌: నేను బ్యాడ్‌ బాయ్‌నే. ఎందుకంటే నేను కూడా బ్యాంకాక్‌ వెళ్లా కదా!(నవ్వులు)

వైజాగ్‌ అబ్బాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. ఎందుకని?

రాజ్‌ తరుణ్‌: వైజాగ్‌లో పబ్‌ కల్చర్‌ ఉండదు. సాయంత్రమైతే బీచ్‌లో కూర్చొని పిచ్చాపాటీ మాట్లాడుకోవడం అలవాటు. బయట తిరుగుతూ ఉంటారని బహుశా ఆ టాక్‌ వచ్చిందేమో. నిజం చెప్పాలంటే వాళ్లే నిజమైన కుర్రాళ్లు.

'ఉయ్యాల జంపాల' అంటే చిన్న వయసులో ఎక్కుతారు. మీరేంటి యుక్త వయసులో ఉయ్యాలెక్కారు?

రాజ్‌ తరుణ్‌: అలా కుదిరింది.

raj tarun in uvvayala jampala
ఉయ్యాల జంపాల సినిమాలో రాజ్ తరుణ్

మొదట్లో ఎన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేశారు? సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది?

రాజ్‌ తరుణ్‌: 52 షార్ట్‌ ఫిలింస్‌ చేశా. 'ఉయ్యాల జంపాల' చిత్రానికి నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నా. స్క్రీన్‌ప్లే, డైలాగ్‌ రాయడంలో కూడా సాయం చేశా. హీరోల కోసం వెతుకుతుంటే 'ఎవరో ఎందుకు నువ్వే చేయొచ్చు కదా' అన్నారు. అలా నటించడానికి ఒప్పుకున్నా. ఆ సమయంలో ఒక గమ్మత్తయిన సంఘటన జరిగింది. 'ఉయ్యాల జంపాల'లో హీరోయిన్‌ పాత్ర చాలా ముఖ్యం. దాంతో ఆడిషన్స్‌ చేయడం మొదలు పెట్టారు. లోబడ్జెట్‌ ఫిల్మ్‌ కావడం వల్ల అప్పటికి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో నేను ఒక్కడినే ఉండేవాడిని. దాదాపు 30మంది అమ్మాయిలను ఆడిషన్‌ చేశారు. వారితో పాటు నేను కూడా డైలాగ్‌లు చెబుతూ ఉండేవాడిని. అది వాళ్లకు నచ్చి, ‘వేరే వాళ్లు ఎందుకు నువ్వే చేసేయొచ్చు కదా’ అని హీరో అవకాశం నాకు ఇచ్చారు.

ఏమవుదామని ఇండస్ట్రీకి వచ్చారు?

రాజ్‌ తరుణ్‌: డైరెక్టర్‌, రచయితను అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. ఇప్పటికీ ఆ కోరిక అలాగే ఉంది.

రాజా రవీంద్ర దగ్గర ఉన్న హీరోలందరూ యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్‌ కూడా చేయాలనుకుంటున్నారట?

రాజ్‌ తరుణ్‌: నేను డైరెక్టర్‌ను కావాలని ఎప్పటి నుంచో ఉంది. ఆ తర్వాతే యాక్టింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. నేను కూడా కచ్చితంగా డైరెక్షన్‌ చేస్తా.

హీరోగా మీరు సినిమా చేసేటప్పుడు మీలోని డైరెక్టర్‌ బయటకు వస్తాడా?

రాజ్‌ తరుణ్‌: అస్సలు రాడు. నాకు ఏవైనా అనుమానాలుంటే ముందే అడిగేస్తా. ఒకసారి సెట్‌లోకి వెళ్లిన తర్వాత స్క్రిప్ట్‌లో వేలు పెట్టను. అయితే, ఏదైనా తప్పు జరుగుతుందనిపిస్తే చెప్పాలా? వద్దా? అన్నది నాకూ దర్శకుడికి మధ్య ఉన్న చనువును బట్టి ఉంటుంది. బాగా దగ్గరైన 'ఒరేయ్‌ బుజ్జిగా..' డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ ఎవరు చెప్పినా వింటారు.

మీ కుటుంబం గురించి?

రాజ్‌ తరుణ్‌: నాన్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. అమ్మ గృహిణి. నేను ఒక్కడినే.

వరుసగా మూడు హిట్‌లు కొట్టారు. దాని వల్ల గర్వం వచ్చిందా? ఒదిగి ఉండాలనిపించిందా?

రాజ్‌ తరుణ్‌: సినిమా విడుదలకు ముందు ప్రివ్యూ చూస్తాను. థియేటర్‌లో ఎప్పుడూ సినిమా చూడలేదు. సినిమా హిట్టయినా.. ఫ్లాప్‌ అయినా ఒకేలా తీసుకుంటా. కాకపోతే ఫ్లాప్‌ అయిన సినిమా బాధను మర్చిపోవటానికి వెంటనే మరో సినిమాలో బిజీ అయిపోతా.

మీరు చేసిన సినిమాల్లో హిట్‌ అవుతుందనుకున్న సినిమా ఏదైనా ఫ్లాప్‌ అయిందా?

రాజ్‌ తరుణ్‌: ప్రతి సినిమా హిట్‌ కావాలనే చేస్తాం కదండీ. అయితే, ‘అంధగాడు’ సినిమా బాగా ఆడుతుందనుకున్నా. అయితే, అనుకున్నట్టుగా హిట్‌ కాలేదు. ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా చేసినందుకు నేను ఎప్పుడూ హ్యాపీగానే ఫీలవుతా.

raj tarun
రాజ్​ తరుణ్

నాన్న బ్యాంకు ఉద్యోగి. మరి మీరెందుకు ఈ ఫీల్డ్‌కు వచ్చారు?

రాజ్‌ తరుణ్‌: చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసేవాడిని. అప్పటి నుంచి రైటింగ్‌పై ఆసక్తి పెరిగింది. అయితే, వ్యక్తుల కంటే సినిమాలు నాకు ఎక్కువ స్ఫూర్తిని నింపాయి. క్రిస్టోఫర్‌ నోలాన్‌ తీసిన ‘మెమెంటో’ చూసిన తర్వాతే అసలు స్క్రీన్‌ప్లే అంటే ఏంటో అర్థమైంది. ఆ సినిమాలో క్లైమాక్స్‌ మొదట చూపిస్తారు. అలా అలా చివరకు ఫస్ట్‌సీన్‌ వస్తుంది. అది చూసిన తర్వాత ‘ఇలాగే కథ చెప్పాలన్న నియమం ఏదీ లేదు. ప్రేక్షకుడిని ఆసక్తికి గురిచేసే విధంగా ఎలా చెప్పినా పర్వాలేదు' అనిపించింది. దీంతో అప్పటి నుంచి కథలు రాయడంపై దృష్టి పెట్టాను.

‘ఉయ్యాల జంపాల’కు రచనలో సహకారం అందించారు? ఇన్నేళ్లలో మరే సినిమాకు పని చేయలేదా?

రాజ్‌ తరుణ్‌: లేదండీ.‘రంగులరాట్నం’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో రెండు పాటలు మాత్రం రాశా. అయితే, పాటలెప్పుడూ పాడలేదు(నవ్వులు)

raj tarun in uvvayala jampala
ఉయ్యాల జంపాల సినిమాలో రాజ్ తరుణ్

కెమెరామెన్‌ రత్నవేలును బాగా విసిగించారట!

రాజ్‌ తరుణ్‌: ఓహో..! అదా ‘కుమారి 21ఎఫ్‌’ అప్పుడు జరిగింది. పెద్ద కెమెరామెన్‌ కదా! అందుకే నాకు ఆసక్తి పెరిగిపోయింది. ఆయన ఏ షాట్‌ పెట్టినా.. ఇదేంటి? అదేంటి? ఇలా ఎందుకు పెట్టారు? అంటూ ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడిని. మొదటి రెండు రోజులు బాగా విసిగించా. మూడో రోజు నుంచి ఆయనే నన్ను పిలిచి ప్రతి షాట్‌ గురించి చెప్పేవారు.

ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇంట్లో ఏమీ అనలేదా?

రాజ్‌ తరుణ్‌: మా ఇంట్లో నన్ను ఎక్కువగా సపోర్ట్‌ చేసింది నాన్నే. షార్ట్‌ ఫిల్మ్స్‌ అనే కాన్సెప్ట్ ఉంటుదన్న విషయం నాకు తెలియదు. అప్పుడు నాకు 13ఏళ్లు. ఎనిమిదో తరగతి చదువుతున్నా. ఏదైనా చేయాలని ఉత్సాహం ఉండేది. అప్పట్లో మా ఇంట్లో డిజిటల్‌ కెమెరా ఉండేది. దాన్ని తీసుకుని ఒక గదిలోకి వెళ్లి కెమెరా ఆన్‌ చేసి, స్టూల్‌పై పెట్టి నాకు నచ్చినట్లు నటించడం మొదలు పెట్టా. అలా అలవాటైంది. వైజాగ్‌లో ఎక్కడ షూటింగ్‌ చేసుకుంటామని అడిగినా, ‘చేసుకోండి’ అనేవారు. ఒక షార్ట్‌ ఫిల్మ్స్‌ తీసి, ఎడిట్‌ చేసి, నాన్నకు చూపిస్తే, డిజిటల్‌ హ్యాండ్‌ కెమెరా కొని పెట్టారు. చాలా ప్రోత్సహించేవారు. ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడింది లేదు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 10-15 రోజులు ఫుడ్‌ లేక ఫుట్‌పాత్ మీద, పెట్రోల్‌ బంకుల్లో పడుకున్నావని విన్నాం నిజమేనా?

రాజ్‌ తరుణ్‌: అప్పుడు ఏదో అలా జరిగిపోయింది. ఇంట్లో కూడా కాస్త ఆర్థిక ఇబ్బందులు. ఆ సమయంలో ఇంటికి వెళ్తే బాగుండదనిపించింది.

‘కుమారి 21ఎఫ్‌’ కథలో ఏం నచ్చింది?

రాజ్‌ తరుణ్‌: రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ నాకు చాలా ఇష్టం. ‘ఆర్య’ చాలా ఇష్టం. ‘జగడం’ తర్వాత వాళ్లకు అభిమానిగా మారిపోయా. సుకుమార్‌గారు కథ చెప్పిన తర్వాత చాలా ఆసక్తిగా అనిపించింది.

ఏ దర్శకుడితో చేయాలని ఉంది?

రాజ్‌ తరుణ్‌: రాజమౌళిగారితో పనిచేయాలని ఉంది.

కరోనా కాలంలో నిఖిల్‌లాంటి వాళ్లు చాలా మంది పెళ్లి చేసుకున్నారు. మీ పెళ్లి ఎప్పుడు?

రాజ్‌ తరుణ్‌: నిఖిల్ కు తన పెళ్లి చాలా గ్రాండ్‌గా చేసుకోవాలని ఉండేది. కరోనా రావడంతో సింపుల్‌గా చేసుకోవాల్సి వచ్చింది. నాది కూడా లవ్‌ మ్యారేజ్‌ అవుతుంది. కానీ సమయం పడుతుంది.

స్వయంవరంలాంటిది ఏదైనా ప్లానింగ్‌ ఉందా?

రాజ్‌ తరుణ్‌: (నవ్వులు) స్వయంవరం పెడితే ఒక్కడినే కూర్చొని ఈగలు తోలుకోవాలేమో. అసలు 27ఏళ్లు రాగానే పెళ్లి చేసుకుందామనుకున్నా. ఇప్పుడు మరో రెండు, మూడేళ్లు ఆగుతా.

తర్వాతి ప్రాజెక్టులు ఏంటి?

రాజ్‌ తరుణ్‌: కొండా విజయ్‌ కుమార్‌ గారితోనే మరో సినిమా ఉంది. అన్నపూర్ణా స్టూడియోస్‌, రానా ప్రొడక్షన్స్‌లో సినిమాలు ఉన్నాయి.

లాక్‌డౌన్‌లో ఏం చేశారు?

రాజ్‌ తరుణ్‌: నిద్ర లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకూ సినిమాలు చూడటమే పని. ఒక రకంగా చెప్పాలంటే నెట్‌ఫ్లిక్స్‌ను తినేశా. మధ్య మధ్యలో కథా చర్చలు జరుగుతుండేవి.

‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌ అప్పుడు మహేశ్‌ మీతో మాట్లాడారట!

రాజ్‌ తరుణ్‌: ‘సినిమా చూపిస్త మావ’ చూశారాయన. బాగా నచ్చిందట. ఇదే విషయాన్ని ఆయన రత్నవేలుగారికి చెబితే ‘రాజ్‌ తరుణ్‌ మీకు పెద్ద ఫ్యాన్’ అని చెప్పారట. దాంతో పిలిస్తే వెళ్లి కలిసి మాట్లాడా. ఆ తర్వాత ఆనందంలో కారులోనే మూడు గంటలు పడుకుని ఉండిపోయా.

raj tarun with mahesh babu
మహేశ్​బాబుతో రాజ్​ తరుణ్

‘ట్యాక్సీవాలా’, ‘గీత గోవిందం’, ‘శతమానం భవతి’, ‘నేను లోకల్‌’ ఎందుకు రిజెక్ట్‌ చేశారు?

రాజ్‌ తరుణ్‌: ‘ట్యాక్సీవాలా’ కథ బాగా నచ్చింది. కానీ, హారర్‌ జోనర్‌ అంటే ఏదోలా అనిపించింది. ఇంతవరకూ ఆ జోనర్‌లో సినిమా చేయలేదు. ‘గీత గోవిందం’ ఆఫర్‌ నాకు అసలు రాలేదు. ఇక ‘శతమానం భవతి’ ఒప్పుకోకపోవడానికి కారణం అప్పటికే మూడు సినిమా చేస్తున్నా. దిల్‌రాజుగారేమో కచ్చితంగా సంక్రాంతికి సినిమాను తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు. నాకు డేట్స్‌ కుదరలేదు. ‘నేను లోకల్‌’ ప్రసన్న రాసిన కథ. ఇద్దరం కూర్చొని చాలా చర్చించుకుంటాం. ఆయన రాసిన ప్రతి కథ నాకు చెబుతాడు. అంటే నేను చేయాలన్న ఉద్దేశం కాదు. నాతో పంచుకుంటారంతే. ఆ కథ నాకు చెప్పారు కానీ, ఆఫర్‌ చేయలేదు. ‘హలో గురూ ప్రేమ కోసమే’కూడా నాకు మొదట చెప్పారు. అలా ఏ కథ రాసుకున్నా నాతో చెబుతారు.

అల్లు అర్జున్‌, సునీల్‌ కోసం కథ రాశారట!

రాజ్‌ తరుణ్‌: అల్లు అర్జున్‌కు, సునీల్‌కు వేర్వేరుగా కథలు రాశా. ఏదైనా కథ రాసినప్పుడు ఎవరినో ఒకరిని ఊహించుకుని రాస్తాం కదా! అలా ఆ రెండు కథలు వారిని ఊహించుకుని రాశా. ఎప్పటికైనా ఈ సినిమాలు చేస్తా.

అవికగోర్‌తో రెండు సినిమాలు చేశారు కదా!

రాజ్‌ తరుణ్‌: తను నాకు గురువులాంటిది. మొదటి సినిమా సమయానికి నాకు నటనలో ఏబీసీడీలు కూడా రావు. ‘ఉయ్యాల జంపాల’ చేసేటప్పుడు చాలా సూచనలు చేసేది.

మొదటి మూడు సినిమాలు హిట్‌. ఆ తర్వాత మళ్లీ బ్లాక్‌బస్టర్‌ అందుకోలేకపోయారు ఎందుకని?

రాజ్‌ తరుణ్‌: ఒక సినిమా ఆడటానికి, ఆడకపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో తప్పు జరుగుతుంది. ప్రతిసారీ జరిగిన తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవాలంతే.

ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు?

రాజ్‌ తరుణ్‌: సమంత. ఫంక్షన్స్‌లో రెండు మూడు సార్లు కలిశానంతే.

స్కూల్‌ చదువుతున్న సమయంలోనే ల్యాండ్‌లైన్‌ నంబరు తీసుకుని, అమ్మాయిలకు ఫోన్‌ చేసేవారట!

రాజ్‌ తరుణ్‌: అందరూ తెలిసినవాళ్లే కాబట్టి, ఫోన్‌ చేసి మాట్లాడేవాడిని. ఏ సమస్యా ఉండేది కాదు. (నవ్వులు)

జీవితం ప్రతి ఒక్కరికీ ఒక సర్‌ప్రైజ్‌ ఇస్తుంది. మీకేమిచ్చింది?

రాజ్‌ తరుణ్‌: ‘ఉయ్యాల జంపాల’. ఎందుకంటే నేనెప్పుడూ నటుడిని అవుతానని అనుకోలేదు. ఆ సినిమా కోసం పనిచేసేటప్పుడు నా షాట్స్‌ వరకూ నటించేవాడిని. మిగిలిన సమయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసేవాడిని. సినిమా బాగా రావాలి. విడుదలవ్వాలి. అనే ఆలోచన తప్ప. ఆ సినిమాలో నేను హీరోనని ఎప్పుడూ అనుకోలేదు. మార్నింగ్‌ షోకు భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్‌కు వెళ్లాం. హౌస్‌ఫుల్‌ బోర్డు కనిపించింది. ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు.

‘కుమారి 21ఎఫ్‌’ హిట్టయిన తర్వాత రెమ్యునరేషన్‌ పెంచారని టాక్‌ నిజమేనా?

రాజ్‌ తరుణ్‌: అదేం లేదండీ. పెంచి ఉంటే బాగుండేదేమో. జీవితంలో ఇన్ని కష్టాలుండేవి కావు.

రాజ్‌తరుణ్‌ అంటే తెలుగు ఇండస్ట్రీ ధనుష్‌ అని టాక్‌ ఎంత వరకూ నిజం?

రాజ్‌ తరుణ్‌: అలా అంటుంటే బాగుంది. ‘ఉయ్యాల జంపాల’ సమయంలో అనేవారు. ఆయనతో పోల్చడం నా అదృష్టం. ధనుష్‌ టాలెంట్‌ వేరే లెవల్‌లో ఉంటుంది.

విష్ణుతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

రాజ్‌ తరుణ్‌: ఆయన నిజంగా జెంటిల్‌మెన్‌. మంచి వ్యక్తి. సెట్‌లో నాకు ఎలాంటి సమస్య రాకుండా చాలా బాగా చూసుకునేవారు. నాకు సోదరుడులాంటివారు.

ఈ అవార్డులు ఎవరికి ఇస్తారు?

  • బెస్ట్‌ ఫ్రెండ్‌ - నిఖిల్‌
  • మిస్టర్‌ చిలిపి - నిఖిల్‌
  • బెస్ట్‌ జోకర్‌ - సునీల్‌ అన్నయ్య
  • యాంగ్రీ బర్డ్‌ - మనోజ్‌
  • ఇంటెలిజెంట్‌ ఇడియట్‌ - నేనే తీసుకుంటా
  • బెస్ట్‌ లయర్‌ - నిఖిల్‌
  • బెస్ట్‌ సెక్సీ - ప్రభాస్‌

ఈ కథానాయికలను ఒక్కో ఆహార పదార్థంతో పోల్చమంటే..?

  • అవికాగోర్‌ - ఖలాకండ్‌
  • హెబ్బాపటేల్‌ - ఖీర్‌
  • రకుల్‌ - ఉండ్రాళ్లు
  • తమన్నా - కాజూ బర్ఫీ
  • సన్నీ లియోని - గరమ్‌ మసాలా

చిన్నప్పుడు విశాఖలో రోడ్లపై ట్రాఫిక్‌ మళ్లించేవారట!

రాజ్‌ తరుణ్‌: రోడ్డుపై క్రికెట్‌ ఆడేవాళ్లం. దాంతో రోడ్డుపై వచ్చేవాళ్లందరిని వేరే దారిలో వెళ్లిపోమని చెప్పేవాళ్లు.

మీ గర్ల్‌ఫ్రెండ్‌ పేరేంటి?

రాజ్‌ తరుణ్‌: ప్యూచర్‌ మిస్సెస్‌ రాజ్‌తరుణ్‌

వారంలో ఒకరోజును డిలీట్‌ చేయమంటే దేన్ని డిలీట్‌ చేస్తారు?

రాజ్‌ తరుణ్‌: సోమవారం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి శని, ఆదివారాలు సెలవు తీసుకుని, సోమవారం స్కూల్‌కు వెళ్లాలంటే చాలా చిరాకు వచ్చేసేది. ఇప్పటికీ నాకు సోమవారం అంటే ఇష్టం ఉండదు.

కాశీ వెళ్లి గంగానదిలో ఏదైనా వదిలేయమంటే ఏం వదిలేస్తారు?

రాజ్‌ తరుణ్‌: ఫోన్‌ వదిలేస్తా. (నవ్వులు)

మిమ్మల్ని నిద్రలో కూడా వెంటాడే కల ఏంటి?

రాజ్‌ తరుణ్‌: రెండేళ్ల వరకూ ఒక కల రోజూ వచ్చేది. నన్ను ఎవరో తరుముతూ ఉంటారు. పరిగెత్తుకుంటూ వెళ్లి కొండపై నుంచి పడిపోతున్న సమయంలో హఠాత్తుగా నిద్రలేస్తా.

న్యూస్‌లో ఎలాంటి వార్తలు రావాలి?

రాజ్‌ తరుణ్‌: పాజిటివ్‌గా ఏది వచ్చిన పర్వాలేదు

Last Updated : Oct 8, 2020, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.