ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'చావుకబురు చల్లగా' జంట పాల్గొంది. ఈ సందర్భంగా వాళ్లతో ఆలీ చేసిన సంభాషణ నవ్వులు పూయించేలా ఉంది. 'మీ నాన్న ఏం చేస్తుంటారు' అని కార్తికేయను ఆలీ అడగ్గా.. అనుకోకుండా.. 'ఆర్‌ఎక్స్100' అని చెప్పి నాలిక్కరుచుకుంటాడు కార్తికేయ.
కార్తికేయను పెళ్లెప్పుడు అని ప్రశ్నించగా.. ఇప్పుడున్న ఇమేజ్‌ను మార్చుకున్నాక చేసుకుంటానని(నవ్వుతూ) చెప్పాడు. ఈ ఎపిసోడ్ మార్చి 29న ప్రసారం కానుంది. అయితే.. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఆలస్యమెందుకు చూసేయండి మరి..!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: శరవేగంగా 'ఖిలాడి' షూటింగ్.. 'లవ్‌స్టోరి' లిరికల్ వీడియో