ETV Bharat / sitara

సరికొత్త సీరియల్ 'గౌరమ్మ'.. త్వరలో మీ ముందుకు

author img

By

Published : Mar 30, 2021, 12:50 PM IST

Updated : Mar 30, 2021, 12:59 PM IST

సరికొత్త సీరియల్​తో మీ ముందుకు రాబోతుంది ఈటీవీ. 'గౌరమ్మ' అనే టైటిల్​తో వస్తోన్న ఈ ధారావాహిక ప్రతిరోజూ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రసారం కానుంది.

Gowramma Upcoming Serial
సరికొత్త సీరియల్ 'గౌరమ్మ'

ఎల్లపుడూ సరికొత్త సీరియల్స్​తో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈటీవీ మరో కొత్త ధారావాహికతో వస్తోంది. 'గౌరమ్మ' అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీరియల్​ని సకుటుంబ సపరివారంగా చూసేట్టుగా రూపొందించారు.

వరాలిచ్చే దేవత ఊరూరా ఉంటుంది. అలాగే వారి ఊరికి వరమైన దేవత గౌరమ్మ. ఆమె ముట్టుకుంటే బంగారమే. తన చేత ఏది ప్రారంభించినా అది దిగ్విజయమే. అలాంటి ఆమె జీవితంలోకి రాముడి లాంటి భర్త వస్తాడని అందరూ అనుకుంటే రావణుడు వస్తే? గోదారిలా సాగిపోతున్న ఆమె జీవితం ఏ తీరానికి చేరబోతుంది? ఎన్ని మలుపులు తిరగబోతుంది? వంటి అంశాలతో ఆమె జీవితంలో ఎదురైన కష్టసుఖాల సమాహారమే 'గౌరమ్మ' సీరియల్.

ఏప్రిల్ 5 నుంచి ఈ సీరియల్ ప్రారంభంకానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ సీరియల్ ప్రోమో చూసి ఆనందించండి.

సరికొత్త సీరియల్ 'గౌరమ్మ' ప్రోమో

ఇవీ చూడండి: సరికొత్త సీరియల్ 'రన్'​.. మీ ఈటీవీలో!

Last Updated : Mar 30, 2021, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.