ETV Bharat / state

2017లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేష‌న్ ఏర్పాటు చేసిందెవరు? : మంత్రి శ్రీధర్​ బాబు - Minister Sridhar Babu Fires On BRS

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Minister Sreedhar Babu On Musi Riverfront Issue : మూసీ నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్​ ప్రభుత్వమని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. 2017లోనే ఇందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు. మూసీ ప్రక్షాళనపై గత ప్రభుత్వంలో జరిగిన సమావేశం వివరాలను మంత్రి వెల్లడించారు. వారు చేస్తే మంచి మేము అమలు చేస్తే మాత్రం తప్పంటూ రాద్దాంతం చేయడం తగదన్నారు.

Minister Sridhar Babu Pressmeet On Musi
Minister Sridhar Babu Fires On BRS (ETV Bharat)

Minister Sridhar Babu Slams On BRS Over Musi Protest : మూసీ నది ప్రక్షాళనపై బీఆర్ఎస్​ చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్‌బాబు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మూసీ ప్రక్షాళన తాము చేసిన ఆలోచన కాదని, గత ప్రభుత్వమే రూపకల్పన చేసి ప్రణాళిక రూపొందించిందని వివరించారు. మూసీ నది ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్‌ ఎన్నో సమావేశాలు నిర్వహించారన్నారు. అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని 2021లో కేటీఆర్‌ ఆదేశించారన్నారు. మూసీ నిర్వాసితులకు రెండుపడక గదుల ఇళ్లల్లోకి తరలించాలని కేటీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు.

"గతంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి​ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ అనేక మీటింగ్​లు నిర్వహించి మూసీ రివర్​ బెడ్​కు సంబంధించిన రెండు వైపులా 110 కి.మీ. రోడ్డు నిర్మాణం, బఫర్​జోన్, ఎఫ్​టీఎల్​ కానీ ఇలా అన్నింటినీ కూడా నిర్దారించి, వీటిపై ఉన్న నిర్మాణాలన్నింటినీ కూల్చేయాలని చెప్పారు. జీవో నంబర్​ 07 తీసుకొచ్చి, 2016లో రివర్​ బెడ్​ బౌండరీకి సంబంధించి 50 మీటర్లను బఫర్​ జోన్​గా నిర్దారించాలని బీఆర్ఎస్​ పార్టీ ప్రభుత్వంలో ఈ జీవో తీసుకురావటం జరిగింది. మేము జీవోను ఏమి మార్పులు చేయలేదు. ఆరోజు వాళ్లు ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం, ఇవాళ మేము కార్యచరణ చేస్తే మాత్రం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు."-శ్రీధర్​ బాబు, ఐటీ మంత్రి

మీరు చేస్తే మంచి, మేము చేస్తే మాత్రం తప్పా : మూసీకి ఇరువైపులా 50 మీటర్లను బఫర్‌జోన్‌గా గుర్తించాలని జీవో జారీ చేసిందని, మూసీలో 8,480 అక్రమ కట్టడాలు ఉన్నాయని గత ప్రభుత్వమే లెక్క తేల్చిందన్నారు. మూసీ నదికి హద్దుల గుర్తింపుపై సర్వే కూడా పూర్తి చేసిందన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం కాగితాల వరకే మూసీ ప్రక్షాళనను పరిమితం చేసిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తుంటే మాత్రం రాద్దాంతం చేస్తోందని విమర్శించారు.

సమస్యను మరింత జఠిలం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులను ఎంత నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారో మర్చిపోయారని విమర్శించారు. మూసీ బఫర్‌జోన్‌ గుర్తింపుపై గత ప్రభుత్వమే జీవోఎంఎస్‌ 7ను జారీ చేసిందని, ఆ జీవో ప్రకారమే మేము ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. మీరు చేస్తే మంచి, మేము చేస్తే మాత్రం తప్పా అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.

ఎక్కువశాతం చెరువులను కబ్జా చేసింది బీఆర్‌ఎస్ నేతలే : పీసీసీ చీఫ్​ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ - TPCC Chief Mahesh Kumar Pressmeet

'హైడ్రాపై విష ప్రచారంతో కేటీఆర్, హరీశ్​రావు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు' - Mynampally Slams On BRS Leaders

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.