కరోనాతో విధించిన లాక్డౌన్ వల్ల దాదాపు రెండు నెలలకు పైగా నిలిచిపోయిన సినిమా, సీరియల్స్ షూటింగులు క్రమక్రమంగా మొదలవుతున్నాయి. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న 'నా పేరు మీనాక్షి' సీరియల్ చిత్రీకరణ.. రామోజీ ఫిల్మ్‌సిటీలో పునఃప్రారంభమైంది. నవ్య, వీణ, రమేశ్, గౌతవి, కోట శంకరరావు, సుబ్బరాయ శర్మ తదితరలు ఈ ధారావాహికలో నటిస్తున్నారు. ధారావాహిక ప్రారంభమైనప్పటి నుంచి విజయపథంలో నడుస్తూ.. 1500 ఎపిసోడ్ మైలురాయిని దాటింది. ఆర్కా మీడియా పతాకంపై నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డల పర్యవేక్షణలో తెరకెక్కుతోంది.
కథేంటంటే...
భర్తను కోల్పోయిన మీనాక్షి, కుటుంబానికి దూరంగా జీవిస్తుంటుంది. దీపిక అగర్వాల్ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, తన భర్త క్రిష్ ఆశయాన్ని నెరవేర్చాలని దృఢ సంకల్పంతో ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఆమెకు అండగా ప్రేమ్-జానులు నిలబడతారు. ప్రేమ్-జానులను దూరం చేస్తే తప్ప మీనాక్షిని ఎదుర్కోలేనని తెలుసుకున్న దీపిక అగర్వాల్ అందుకు తగ్గ వ్యూహాన్ని పన్నుతుంది. అగర్వాల్ కుట్రను తెలుసుకున్న మీనాక్షి ఏం చేసింది? ప్రేమ్-జానుల పెళ్లి ఎలా జరిపించింది? లాంటి ఆసక్తికరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు యాట సత్యనారాయణ.
ఇదీ చూడండి: