ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'యమదొంగ', 'విక్రమార్కుడు', 'ఛత్రపతి', 'మగధీర' సినిమాల్ని ఒకే టికెట్‌పై చూపించే ప్రయత్నం చేశాడు నటుడు రామ్ ప్రసాద్. అది ఎక్కడో కాదు ప్రముఖ వినోద కార్యక్రమం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' (ఈటీవీ) వేదికపై. అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక ఎపిసోడ్ రూపొందింది. అదే రోజున ప్రసారం కానున్న ఈ ఆసక్తికర ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
'రాజమౌళి గారి నాలుగు సినిమాల్ని ఒకే టికెట్‌పై చూపిస్తానంటున్న రామ్ ప్రసాద్' అంటూ వ్యాఖ్యాత సుధీర్ మాటలతో ప్రారంభమైన ప్రోమో ఆద్యంతం అలరించింది. రాజమౌళి సినిమాల్లోని కొన్ని పాటలు, సన్నివేశాలకు తమదైన శైలిలో నటించి, ఆకట్టుకున్నారు కొందరు కంటెస్టెంట్లు.
నటుడు నాగినీడు (మర్యాద రామన్న ఫేం) ముఖ్య అతిథిగా విచ్చేసి, తన కామెడీ టైమింగ్‌తో అలరించారు. నూకరాజు ఎప్పటిలానే నవ్వులు పూయించాడు. ప్రేమ, పరువు, చావు.. నేపథ్యంలో వర్ష, ఇమ్మాన్యుయేల్ చేసిన స్కిట్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. మరి మరోసారి రాజమౌళి సినిమాల్ని చూసేందుకు సిద్ధమవుతున్నారా? ఈ హంగామా అంతా చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'టీవీలో వస్తున్నా అమ్మా.. ప్లీజ్ చూడమ్మా'