తెలుగులో మొట్టమొదటిసారి రూ.కోటి వసూళ్లు 'అడవిరాముడు' సినిమా సాధించిందని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు(K Raghavendra Rao Movies) చెప్పారు. ప్రొజెక్టర్ ఆగకుండా నడిచిన సినిమా కూడా ఇదేనని అన్నారు. థియేటర్లో పాటలు వస్తుంటే డబ్బులు వేయటం ఈ సినిమాతోనే ప్రారంభమైందని అప్పటి విషయాల్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ కోసమే కథ రాసుకున్నట్లు వివరించారు. ఆ చిత్రానికి దర్శకత్వం చేయటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
అడవిరాముడు చిత్రీకరణ చివరిరోజు ఎన్టీఆర్ కాళ్లకు నమస్కారం పెట్టినట్లు రాఘవేంద్రరావు గుర్తుచేసుకున్నారు. 'జ్యోతి' సినిమాను కేవలం 28 రోజుల్లోనే తీశామని తెలిపారు. సెంటిమెంట్ ప్రకారమే రాఘవేంద్రరావు(K Raghavendra Rao Movies) పక్కన బీ.ఏ అని పెట్టుకున్నట్లు వివరించారు.
అలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి గతంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు వచ్చినప్పుడు పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. దర్శకుడిగా 46 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన.. 'పెళ్లి సందD'తో నటుడిగా మారారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: Paruchuri Brothers Movies: 'ఎన్టీఆర్ కలుద్దామంటే కుదరదన్నాను'