'ఢీ:13' డ్యాన్స్ షో క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్బంగా డ్యాన్స్ విత్ సెలబ్రిటీ రౌండ్ పెట్టారు. దీంతో పలువురు నటీనటులు కంటెస్టెంట్లతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.
'కలర్‌ఫొటో'తో హీరోగా ఆకట్టుకున్న సుహాన్.. 'అత్తో అత్తమ్మ కూతురో' పాటకు అద్భుతమైన స్టెప్పులేసి అలరించారు. ఆ తర్వాత సుధీర్-ఆదితో కలిసి పంచులు వేసి కామెడీ కూడా చేశారు.
కన్నడలో టాప్ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్‌గా కూడా షోలో పాల్గొని సందడి చేశారు. 'బిగ్‌బాస్' ఫేమ్ సొహైల్ కూడా 'గబ్బర్‌సింగ్'లోని పిల్లా నువ్వే లేని జీవితం పాటకు అదిరిపోయేలా స్టెప్పులేశాడు. దీంతో పాటు 'నాట్యం' ఫేమ్ సంధ్యారాజు అతిథిగా విచ్చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: