జడ్జి కుర్చీలో కూర్చుని డ్యాన్సర్లకు తప్పొప్పులు చెప్పే గణేశ్ మాస్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకొని ఉద్వేగానికి గురయ్యారు. ఎందుకో తెలియాలంటే వచ్చే బుధవారం ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ13' చూడాల్సిందే. అదిరిపోయే డ్యాన్సులతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రతివారం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న కార్యక్రమం 'ఢీ13'. వచ్చే వారం అన్ని రకాల మేళవింపులతో వినోదం వడ్డించేందుకు సిద్ధంగా ఉంది. ఒకే టికెట్‌పై ఆరు సినిమాలు చూసేందుకు మీరూ సిద్ధమైపోండి.
ఈసారి కంటెస్టెంట్లు మాత్రమే కాదు.. టీమ్‌లీడర్లు, జడ్జిలు కూడా స్టేజీ మీద అదరగొట్టే పెర్ఫార్మెన్సులు ఇచ్చి వారెవ్వా అనిపించనున్నారు. 'జై లవకుశ'లో జైగా యాంకర్ ప్రదీప్, 'అరుంధతి'లో అరుంధతిగా పూర్ణ, 'మగధీర'లో మిత్రవిందగా ప్రియమణి, కాలభైరవగా ఆది, 'జానీ'గా గణేశ్ మాస్టర్, 'ఇంద్ర'గా సుధీర్, 'ఏమాయ చేశావే'లో జెస్సీగా రష్మీ కనిపించి సందడి చేయనున్నారు. వీటితో పాటు ఢీ అంటే ఢీ అనేలా 'కింగ్స్ వర్సెస్ క్వీన్స్' కంటెస్టెంట్లు డ్యాన్సులు అదరగొట్టారు.
'శృంగార వీర' పాటకు పూర్ణ, సుధీర్ కలిసి చేసిన నృత్యం అందరి చేత ఈలలు వేయించింది. మరోవైపు ప్రియమణి, సుధీర్ కలిసి 'నరసింహ' సినిమా స్పూఫ్ చేశారు. రజనీకాంత్ డైలాగ్స్ సుధీర్ చెబుతుండగా.. రమ్యకృష్ణగా ప్రియమణి కనిపించింది. ఆ తర్వాత 'వకీల్‌సాబ్'లో 'జనగణమన' పాటకు ఢీ కంటెస్టెంట్ డ్యాన్స్ ప్రదర్శనతో పాటు డైలాగులు కూడా చెప్పి అందరితో కన్నీళ్లు పెట్టించాడు. గణేశ్ మాస్టర్ అయితే.. తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న ప్రియమణి, పూర్ణ మాస్టర్‌ను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆది, రష్మి కూడా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రోమోలో కనిపించింది.
ఇంతకీ ఒక్క టికెట్ ఆరు సినిమాలు అన్నారు కదా.. ఆ సినిమాలేంటో తెలుసా.? బిజినెస్‌మేన్, జయం, వకీల్‌సాబ్, నరసింహ, అర్జున్‌రెడ్డి, సై.. ఈ సినిమాల పాటలకు కళ్లు చెదిరే పెర్ఫార్మెన్సులు ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 11న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటివరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి మరి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: