కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు సుధీర్, ఆది, ప్రదీప్ కామెడీతో ఆద్యంతం అలరించే డ్యాన్స్ షో 'ఢీ 13: కింగ్స్ వర్సెస్ క్వీన్స్'. ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు ప్రసారమవుతుంది. కొత్త ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలై వినోదం పంచుతోంది.
ఇందులో.. కంటెస్టెంట్లు అభి, కార్తీక్ తమ డ్యాన్స్‌తో న్యాయ నిర్ణీతల మనసు గెలుచుకున్నారు. రష్మి, దీపికా పిళ్లై, సుధీర్, ఆది, పూర్ణ సరదాగా స్టెప్పులేసి సందడి చేశారు. ఇదంతా ఒకే. కానీ, ప్రేమలేఖ ఏంటి? అనుకుంటున్నారా? అదేంటంటే.. ఈ షోలో టీం లీడర్లుగా వ్యవహరిస్తోన్న సుధీర్, ఆదిల టాస్క్ అది. ఇద్దరూ పెన్నూ పేపరు పట్టుకుని తమ భావాల్ని అక్షరీకరించారు. 'దీపికా దీపికా నీ గురించి రాయడానికి నాకు లేదు ఓపికా' అంటూ దీపికని, 'ప్రియ.. నిన్ను చూడగానే పడిపోయా' అని ప్రియమణిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించాడు ఆది. మరి సుధీర్ ఎవరి కోసం ప్రేమలేఖ రాశాడో మాత్రం ఇంకా బయటపెట్టలేదు. ఆ సంగతి తెలుసుకోవాలంటే జులై 7 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోతో ఆనందించండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="">