మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన కెప్టెన్ మార్వెల్ చిత్రం బిలియన్ డాలర్ (6వేల కోట్లకు పైగా) మార్కును అందుకుంది. తొలిసారి మహిళా సూపర్హీరోతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్లు వసూలు చేసింది. బ్రై లార్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ అమెరికాలోనే
- " class="align-text-top noRightClick twitterSection" data="">
358 మిలియన్ డాలర్లు (2వేల 4వందల కోట్లు) కలెక్షన్లు సాధించింది. మిగిలిన దేశాల్లో 645 మిలియన్ డాలర్ల(4వేల కోట్లు) వసూళ్లను రాబట్టింది.
వెయ్యి కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం తొలి వారంలోనే 455 మిలియన్ డాలర్లు (3 వేల కోట్లు) రాబట్టుకుంది. ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన మార్వెల్ సినిమాల్లో ఈ చిత్రం ఏడో స్థానంలో ఉంది.
ఓ ప్రమాదంలో గ్రహాంతర వాసి డీఎన్ఏ.. అమెరికా వాయుసేన పైలట్ డీఎన్ఏతో కలిసిపోతుంది. దీంతో ఆమెకు అతీత శక్తులు వస్తాయి. ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి దుష్టులతో ఎలా పోరాడింది.. అనేది ప్రధాన కథాంశం. అనా బోడెన్, ర్యాన్ ఫ్లెక్ ఈ సినిమాకు దర్శకులు. వాల్ట్ డిస్నీ, మార్వెల్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కింది.