ETV Bharat / sitara

సినిమాల్లో బ్రహ్మానందం జోరు ఎందుకు తగ్గింది? - ali tho saradaga promo

Ali tho saradaga: ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోలో బ్రహ్మానందం పాల్గొన్నారు. రెండో భాగానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు అలరిస్తోంది.

brahmanandam
బ్రహ్మానందం
author img

By

Published : Dec 1, 2021, 11:36 AM IST

Ali tho saradaga promo: 'ఆలీతో సరదాగా' టాక్​ షోకు విచ్చేసిన హాస్య నటుడు బ్రహ్మానందం.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సోమవారం(నవంబరు 29) ప్రసారమైన ఎపిసోడ్.. నెటిజన్లను తెగ అలరిస్తోంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండో భాగాన్ని కూడా ప్రసారం చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.

brahmanandam: ఇందులో ఎస్వీఆర్​లా మిమిక్రీ చేసిన బ్రహ్మానందం.. అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు. తాను హాస్యం, చిత్రకళే కాకుండా మిమిక్రీ కూడా చేయగలనని నిరూపించారు.

brahmanandam ali tho saradaga
బ్రహ్మానందం

అందరినీ బ్రహ్మానందం నవ్విస్తే, మిమ్మల్ని నవ్వించేది ఎవరు అని అడగ్గా.. "ఇంకెవరు నా మనవడు" అంటూ ఆ చిన్నారి హావభావాల్ని చేసి మరి అలీకి చూపించారు.

ఈ మధ్య కాలంలో సినిమాలు ఎందుకు తగ్గాయి అని బ్రహ్మానందంను అలీ అడగ్గా.. తన కళ్లజోడు కిందపడేసి స్టేజీ పైనుంచి లేచి వెళ్లిపోయారు. అసలు ఏం జరిగింది? అనేది తెలియాలంటే డిసెంబరు 6న పూర్తి ఎపిసోడ్​ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

ఇది చదవండి: ఆ ముగ్గురికి నా జీవితంలో ప్రత్యేక స్థానం: బ్రహ్మానందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.