ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-3 జులైలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ సరికొత్త సీజన్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల భాగం కానున్నారని కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దీనిపై జ్వాల ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన గురించి వస్తున్న వదంతుల్లో ఎలాంటి నిజం లేదని, తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు.
-
No big boss for me!!!
— Gutta Jwala (@Guttajwala) May 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
All false rumours!!
">No big boss for me!!!
— Gutta Jwala (@Guttajwala) May 25, 2019
All false rumours!!No big boss for me!!!
— Gutta Jwala (@Guttajwala) May 25, 2019
All false rumours!!
ఈ షోలో పాల్గొనేందుకు జ్వాలకు అవకాశమిస్తే ఆమె ఎక్కువ పారితోషికం అడిగారని... అందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదని సమాచారం. బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మూడో సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయనున్నారు. శ్రీముఖి, వరుణ్ సందేశ్, వైవా హర్ష, ఆర్జే హేమంత్ ఈ షోలో సందడి చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.