ETV Bharat / sitara

'ఓ నిర్మాత చేసిన పనికి రాత్రంతా భయంతో పడుకున్నాం'

సూపర్​హిట్​ సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్న రేలంగి నరసింహారావు.. దర్శకుడు కోడిరామకృష్ణతో జరిగిన గొడవ గురించి మాట్లాడారు. ఈ వివాదం ఎలా జరిగింది, ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడుకున్నారు వంటి విషయాలను చెప్పారు. దీంతో పాటే ఓ దర్శకుడు తనను చెంపదెబ్బ కొట్టిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.

alitosaradaga relangi
రేలంగి
author img

By

Published : Aug 10, 2021, 10:49 AM IST

Updated : Aug 10, 2021, 11:10 AM IST

అలనాటి దర్శకుడు రేలంగి నరసింహారావు.. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోకు హాజరై తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ క్రమంలోనే దర్శకుడు కోడి రామకృష్ణతో జరిగిన గొడవను గుర్తుచేసుకున్నారు.

"పాలకొల్లులో ఉన్నప్పుడు కోడి రామకృష్ణ నేను మంచి ఫ్రెండ్స్​. ఒకటే క్లాస్​, బెంచ్, రూమ్​. మేమిద్దరం సహా మరో ఇద్దరు చదువుకోవడానికి ఒక రూమ్​ తీసుకుని ఉండేవాళ్లం. తర్వాత రామ్​కృష్ణ.. ఓ అసోసియేషన్​కు ప్రెసిడెంట్​గా ఉండేవాడు. అది మూలనపడిపోయింది. దాన్ని యాక్టివ్​ చేశా. డొనేషన్స్​ సేకరించాం. అయితే ఆ విరాళాలను కొంతమంది అనవసరపు ఖర్చు చేసేవారు. ఇలా చేయడం సరికాదని.. వారిని మందలించాలని రామకృష్ణకు చెప్పా. కానీ అతను నా మాట వినలేదు. దీంతో మాట మాట పెరిగి మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో మాట్లాడుకోవడం మానేశాం. అతనేమో సినీఇండస్ట్రీకి వెళ్లాలని నేనేమో డాక్టర్​ చదవాలని.. ఇలా మా ఇద్దరి మధ్య మాటలు మరింత చెడిపోయాయి. అలా 4-5ఏళ్లు చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అనుకోకుండా సినీఇండస్ట్రీకి వెళ్లాలని మద్రాసు బయలుదేరా. ఊరందరికీ చెప్పా. కానీ రామకృష్ణకు చెప్పలేదని నా మనుసు చెదిరిపోయింది. బాగా బాధపడ్డా. దీంతో వాళ్ల ఇంటికి వెళ్లా. అప్పటివరకు బాధలో ఉన్న అతను నన్ను చూసి ఆనందంతో కౌగలించుకున్నాడు. బాగా సంతోషంగా మాట్లాడుకున్నాం. అలా మేమిద్దరం కలిశాం."

-రేలంగి, దర్శకుడు.

ఓ సినిమా షూటింగ్ సందర్భంగా క్లాప్ బోర్డు కిందపెట్టినందుకు తన తొలి గురువు కేఎస్​ఆర్​ దాస్​ తనను కొట్టినట్లు రేలంగి గుర్తుచేసుకున్నారు.

"ఊరికి ఉపకారం సినిమా షూటింగ్​కు అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేస్తున్నాను. దర్శకుడు దాస్​ గారు చాలా వేగంగా షాట్స్​ తీస్తారు. ఎడిటింగ్​ రిపోర్ట్​ మీద సుద్దముక్కతో నెంబరు వేసుకునే సమయం కూడా ఉండేది కాదు. ఈ క్రమంలోనే క్లాప్​ బోర్డును కిందపెట్టి ఎడిటింగ్​ రిపోర్ట్​ మీద రాస్తున్నా. అంతలోనే ఆయన వచ్చి దీని విలువ తెలుసా నీకు? అంటూ కొట్టారు. అప్పుడు క్లాప్​ బోర్డు విలువ తెలిసింది"

-రేలంగి, దర్శకుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓ నిర్మాత చేసిన పనికి తన కుటుంబమంతా ఓ రాత్రి భయంతో పడుకున్నట్లు తెలిపారు రేలంగి.

"నేను అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఓ ప్రొడ్యూసర్​ నాతో సినిమా చేసేందుకు ఓకే చేశాడు. అయితే అతను ఎవరితో మూవీ చేస్తే ఆ దర్శకుడిని, హీరోలను కాకా పడతాడు. అలా ఓసారి మా ఇంటికి వచ్చాడు. అప్పుడు మా ఇంట్లో ఏసీ లేదని తెలుసుకుని దాన్ని కొంటానని చెప్పాడు. నేనేమో ఎంత వద్దని చెప్పినా వినలేదు. గోడకు రంధ్రం కూడా చేయించాడు. సాయంత్రంలోగా ఏసీ తీసుకొస్తానని చెప్పి వెళ్లిన ఆయన ఎంత ఎదురుచూసిన రాలేదు. ఆ రాత్రికి రంధ్రానికి బీరువాను అడ్డుగాపెట్టి ఎక్కడ దొంగలు వస్తారనే భయంలో అక్కడే మంచం వేసుకుని నా కుటుంబంతా నిద్రపోయాం. ఆ తర్వాత రోజు దర్శకుడు వెంకన్న బాబు ఆఫీస్​కు వెళ్లాను. ఈ విషయం గురించి చెప్పా. అనంతరం ఇంటికి వెళ్లే సరికి ఏసీ బిగిస్తున్నారు. వెంకన్న బాబు దాన్ని పంపించారని నా భార్య చెప్పింది. రెండో రోజు మళ్లీ ఆ నిర్మాత మా ఇంటికి వచ్చి ఏసీ తీసుకురావడం కుదరలేదని. ఈరోజు వస్తుందని చెప్పాడు. అయితే అప్పుడే మా పనిమనిషి బట్టలు తీసుకుని వెళ్తుంది. మీ ఇంట్లో వాషింగ్​ మిషన్​ లేదా? కొంటాను అని చెప్పాడు. వద్దు బాబు అంటూ వెళ్లి ఆయన కాళ్ల మీద పడిపోయా" అని సరదాగా చెబుతూ నవ్వులు పూయించారు రేలంగి.

ఇదీ చూడండి: ఒకే రోజు 16 పాటలు.. అమ్మ మందలించింది: సింగర్ చిత్ర

Last Updated : Aug 10, 2021, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.