దక్షిణ భారతదేశంలో అతి పెద్ద డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందింది 'ఢీ'. 12 సీజన్స్ ముగించుకుని ఇప్పుడు 'ఢీ 13: కింగ్స్ వర్సెస్ క్వీన్స్'గా మనముందుకొచ్చి అలరిస్తోంది. ప్రదీప్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోలో ఈ వారం కంటెస్టెంట్ల డ్యాన్స్‌లు ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఓ కంటెస్టెంట్ చేసిన లవ్ ప్రపోజల్ వీక్షకుల మనసును తాకింది.
'రాఖీ' సినిమాలోని 'రాఖీ రాఖీ', 'అలవైకుంఠపురం'లోని 'బుట్టబొమ్మ' పాటలతో పోటీదారులు అదరగొట్టేశారు. ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది చేసిన కామెడీ స్క్రిప్ట్ నవ్వులు పూయిస్తోంది. మొత్తంగా సరదాగా సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో చివర్లో న్యాయనిర్ణేత, నటి పూర్ణ కంటతడి పెట్టింది. ఆమె వెక్కి వెక్కి ఏడ్వగా.. ప్రియమణి, ప్రదీప్, గణేశ్ మాస్టర్ పూర్ణను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఇంతకీ ఆమె ఎందుకు ఏడ్చింది తెలియాలంటే పూర్తి కార్యక్రమం చూసేయండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Dhee 13: 'ఢీ'లో రజనీకాంత్ మేనియా.. అదరగొట్టారుగా!